ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Railway: రైలు వెనుక భాగంలో ఈ గుర్తులకు అర్థమేంటి..? X, LV అనే పదాలు కనుక ట్రైన్ వెనుక భాగంలో కనిపించకపోతే..!

ABN, First Publish Date - 2023-06-05T21:24:29+05:30

రైలు చివరన ఉన్న బోగీ వెనుకవైపున ఎక్స్ ఏలా ఎల్ వీ అని కచ్చితంగా రాసుంటుంది. చివరి బోగీ అదే అని చెప్పేందుకు ఈ ఆంగ్ల అక్షరాలను రాస్తారు. చివరి బోగీపై ఈ అక్షరాలు లేకపోతే స్టేషన్ మాస్టర్ వెంటనే రైలును ఆపేస్తాడు. పరిస్థితిని చక్కదిద్దాకే మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మనందరం లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు రైలు ప్రయాణాలు చేసినోళ్లమే! అంతేకాకుండా, బోగీలపై అనేక రకాల అక్షరాలు, గుర్తులు కనిపించినప్పుడు ఇవేంటో అనే డౌట్ కూడా వచ్చే ఉంటుంది. అయితే, ప్రయాణం హడావుడిలో పడి ఆ విషయాన్ని మరుక్షణమే పక్కన పెట్టేస్తాం. ఇక ప్రతి రైల్లో చివరి బోగీపై ఎక్స్ లేదా ఎల్‌వీ అని పెద్ద ఆంగ్ల అక్షరాల్లో రాసి ఉండటం మనం గమనించే ఉంటాం. ఇలా ఎందుకు రాస్తారో అనేు సందేహం ఎప్పుడైనా కలిగి ఉంటే ఈ రోజుతో మీకా డౌట్ తీరిపోయినట్టే.

రైల్వే అధికారుల ప్రకారం. రైల్లో చివరి బోగీపై ఎక్స్ లేదా ఎల్ అని రాసుంటే ఆ బోగీనే చివరిదని అర్థం. ఒక వేళ రైలు చివరి బోగీలో అలా రాసుండకపోతే వెంటనే స్టేషన్ మాస్టర్ అప్రమత్తమవుతాడు. చివరి బోగీ ట్రైన్ నుంచి విడివడి దార్లో ఎక్కడో ఆగిపోయి ఉంటుందనే అంచనాకు వస్తాడు. వెంటనే రైలును ఆపేస్తాడు. ఈ విషయం గురించి పైఅధికారులకు సమాచారం అందివ్వడమే కాకుండా మళ్లీ పరిస్థితిని చక్కదిద్దేవరకూ రైలును ముందుకు కదలనివ్వడు.

వీటితో పాటూ బోగీల్లో అనేక భద్రతా వ్యవస్థలు ఉంటాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రైలు చివరి బోగీపై వెనకవైపున మిణుకుమిణుకు మనే ఎర్ర బల్పు కచ్చితంగా అమర్చుతారట. చిమ్మ చీకటిలో కూడా ఈ కాంతి కనిపిస్తుందట. ఎర్ర బల్బు అలా మిణుకుమిణుకు మంటుంటే రైలు కదులుతోందని అర్ధం. దీంతో, ఇతర రైళ్లు అప్రమత్తమై పరిస్థితి అనుగుణంగా తమ వేగంలో మార్పులు చేసుకుంటాయట.

Updated Date - 2023-06-05T21:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising