ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Painter Clothes: వారికి రంగు పడుతుందనే భయం అస్సలు లేదు... తెల్లని దుస్తులనే ధరించి పెయింట్ చేస్తుంటారు.. దీనివెనుకనున్న కారణమేమిటో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-03-14T07:06:22+05:30

Painter Clothes: పెయింటింగ్ చేసేటప్పుడు సాధారణ పెయింటర్లు ఏదోఒక దుస్తులను ధరించి పెయింట్(Paint) వేస్తుంటారు. అయితే ప్రొఫెషనల్ పెయింటర్లు(Professional painters) ఎప్పుడూ తెల్లని దుస్తులు ధరించి పెయింటింగ్ పనులు చేస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Painter Clothes: పెయింటింగ్ చేసేటప్పుడు సాధారణ పెయింటర్లు ఏదోఒక దుస్తులను ధరించి పెయింట్(Paint) వేస్తుంటారు. అయితే ప్రొఫెషనల్ పెయింటర్లు(Professional painters) ఎప్పుడూ తెల్లని దుస్తులు ధరించి పెయింటింగ్ పనులు చేస్తుంటారు. పెయింటర్లు యూనిఫాం ధరించి తమ పనిని చేస్తారు, వీరి యూనిఫాం తెలుపు రంగు(white color)లో ఉంటుంది. తెలుపు రంగు బట్టలపై చిన్నపాటి మరక కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

అయినప్పటికీ వారు కేవలం తెలుపురంగు దుస్తులనే ధరించి, ఎందుకు పెయింట్(Paint) చేస్తారో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుపు రంగు సాధారణంగా స్వచ్ఛత(Purity)తో కూడి ఉంటుంది. తెలుపు రంగు అనేది పరిశుభ్రత, రక్షణ, శాంతితో సహా పలు సానుకూల అర్థాలను(Positive connotations) కలిగి ఉంటుంది. చాలా మంది తమకు సానుకూల వాతావరణం ఉండాలనుకునే ఉద్దేశంతో ఇంటిలోని గదులకు తెల్లటి రంగు వేయిస్తుంటారు. మరోవైపు చూస్తే తెలుపు రంగు దుస్తులు(clothing) చాలా చౌకగా ఉంటాయి.

ఇతర రంగు దుస్తుల కంటే తెల్లటి దుస్తుల ధర చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తయారీదారులకు రంగు లేని దుస్తులు తయారు చేయడం చాలా సులభం. కాగా పెయింటర్లు చాలావరకూ ఎండలోనే ఉంటూ పని చేయాల్సి వస్తుంటుంది. అటువంటి స్థితిలో తెలుపు రంగు దుస్తులు వారి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. ఎందుకంటే, తెలుపు రంగు కాంతి(light)ని ప్రతిబింబిస్తుంది.

అలాగే ఏదైనా మరక ఉంటే, తెల్లని దుస్తులపై బ్లీచ్ చేయడం(Bleaching) చాలా సులభం. బ్లీచ్ అనేది పెయింట్ మరకలను చాలా వరకు తొలగిస్తుంది. రంగుల దుస్తులను బ్లీచింగ్ చేస్తే వాటి రంగు వెలిసిపోతుంది. తెలుపు రంగు దుస్తులతో పాటు పెయింటర్లు(Painters) బూట్లు ధరించడం బ్యాలెన్సింగ్‌గా కనిపిస్తుంది. తెలుపు రంగు దుస్తులు క్లాసీగా కనిపిస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్న(Benefits) కారణంగానే ప్రొఫెషనల్ పెయింటర్లు తెలుపు రంగు దుస్తులు ధరిస్తారు.

Updated Date - 2023-03-14T08:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising