ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానాలు వేల అడుగుల ఎత్తులోనే ఎందుకు ఎగురుతాయి? తక్కువ ఎత్తులో ఎగిరితే ఎటువంటి ప్రమాదాలకు అవకాశముందంటే...

ABN, First Publish Date - 2023-05-08T12:16:09+05:30

విమానాలు 30 వేలు లేదా 40 వేల అడుగులకు మించిన ఎత్తులోనే ఎందుకు ఎగురుతాయనే సందేహం మనకు ఎప్పుడో ఒకప్పుడు కలిగేవుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విమానాలు 30 వేలు లేదా 40 వేల అడుగులకు మించిన ఎత్తులోనే ఎందుకు ఎగురుతాయనే సందేహం మనకు ఎప్పుడో ఒకప్పుడు కలిగేవుంటుంది. అంత ఎత్తులో ఆక్సిజన్(Oxygen) తక్కువగా ఉండటానికి తోడు.. ఏదైనా ప్రమాదం జరిగితే భారీగా నష్టం చోటు చేసుకుంటుందని కూడా అనిపిస్తుంది. అయినా అంత ఎత్తులోనే విమానాలు(Airplanes) ఎందుకు ఎగురుతాయి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విమానాలను ఇలా అత్యంత ఎత్తులోనే నడపడానికి అనేక కారణాలున్నాయి. అధిక ఎత్తులో గాలి తక్కువగా ఉంటుంది. గాలి అణువులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే విమానం పూర్తి సామర్థ్యంతో ఎగురుతుంది. ఫలితంగా విమానం మైలేజ్(Mileage) కూడా పెరుగుతుంది. తక్కువ ఎత్తులో విమానం ఎగిరితే.. ఏవైనా పక్షులు విమానాన్ని ఢీకొనే ప్రమాదం తలెత్తుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency landing) చేయాల్సి వస్తుంది. నిజానికి పక్షులు 40,000 అడుగుల లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఎగరలేవు.

అటువంటి పరిస్థితిలో తక్కువ ఎత్తులో కంటే 40,000 అడుగుల ఎత్తులో విమానాన్ని నడపడం సురక్షితం(safe). అప్పుడు పైలట్.. టేకాఫ్. ల్యాండింగ్ సమయంలో మాత్రమే పక్షుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. మరోవైపు విమానాలకు గాలిలో ఏర్పడే తుఫానులు(Storms) పెద్ద సవాలుగా నిలుస్తాయి. తక్కువ ఎత్తులో ఉండే మేఘాలలోని నీరు విమానాల ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర భయాందోళనలకు గురికావాల్సి వస్తుంది. 40 వేల అడుగుల ఎత్తు కన్నా దిగువగా విమానం వెళితే ఇటువంటి సమస్య తలెత్తుతుంది.

అదేవిధంగా విమానం తక్కువ ఎత్తులో ప్రయాణిస్తే కొండ ప్రాంతాల గుండా వెళ్లడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. హిమాలయ శ్రేణి(Himalayan range)లోని అనేక పర్వతాల ఎత్తు 24,000 అడుగుల మేరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పర్వత శిఖరాలను విమానం ఢీకొనే ప్రమాదం ఉంది. కాగా విమానం నడపడానికి అత్యధిక పరిమితి 42,000 అడుగులు. దానికి మించిన ఎక్కువ ఎత్తుకు తీసుకు వెళ్లాలంటే విమానంలోని ఇంజిన్‌(Engine)కు చాలా శక్తి అవసరమవుతుంది. పైగా విమానం క్యాబిన్‌లో ఒత్తిడి చాలా వరకూ తగ్గుతుంది. అందుకే భద్రత(Safety) పరంగా విమానాలు నిర్దిష్ట ఎత్తులో మాత్రమే ప్రయాణిస్తుంటాయి. ఎత్తును తగ్గించడానికి లేదా పెంచడానికి, పైలట్ ఎప్పటికప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(Air Traffic Control) నుండి సూచనలను పొందుతుంటాడు.

Updated Date - 2023-05-08T12:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising