విమానంలో ప్రయాణికులు ఎందుకు చెప్పులు తీయకూడదు? కారణాలు తెలిపిన విమాన సిబ్బంది..
ABN, First Publish Date - 2023-04-02T10:18:29+05:30
విమానంలో చెప్పులు లేకుండా తిరగవద్దని ప్రయాణికులకు విమాన సిబ్బంది(flight crew) సూచిస్తుంటారు. ఇలాంటి సూచన వారు ఎందుకు చేస్తుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
విమానంలో చెప్పులు లేకుండా తిరగవద్దని ప్రయాణికులకు విమాన సిబ్బంది(flight crew) సూచిస్తుంటారు. ఇలాంటి సూచన వారు ఎందుకు చేస్తుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్‌సైడర్ నివేదికలో రీజినల్ ఫ్లైట్ అటెండెంట్ లీషా పెరెజ్(Flight attendant Leisha Perez) తెలిపిన వివరాల ప్రకారం విమానంలో చెప్పులు లేకుండా తిరగడం అనేది అసభ్యకరమైన చర్య(Indecent act) మాత్రమే కాదు.. ఇది పూర్తిగా అపరిశుభ్రమైనది కూడా.
కొన్నిసార్లు బాత్రూమ్(bathroom) నేలపై నీరు ఉండవచ్చు. ప్రయాణికులు అక్కడ నడుస్తూ ఉంటారు. అది మురికి అని వారు గ్రహించరు. విమానంలోని టాయిలెట్‌ను నిత్యం శుభ్రం చేయడం సాధ్యం కాదు. టాయిలెట్(toilet)లో తడిగా ఉండటం వల్ల పడిపోయే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. విమానంలో చెప్పులు లేకుండా నడవడం లేదా సాక్స్ ధరించడం(Wearing socks) అసహ్యకరమైన చర్య అని ఆరోగ్య శాఖ అధికారి ప్రొఫెసర్ జగదీష్ ఖుబ్‌చందానీ పేర్కొన్నారు.
విమాన ప్రయాణంలో పిల్లలు పాదరక్షలు లేకుండా బాత్రూమ్‌కు వెళుతుంటారని, దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పాదాలకు గాయం అయితే, ఇన్ఫెక్షన్(Infection) మరింత వేగంగా వ్యాపిస్తుందన్నారు. విమానం క్యాబిన్‌లు శుభ్రం చేయడానికి 15 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని, అందుకే అవి పూర్తి పరిశుభ్రంగా ఉండవన్నారు. సాధారణంగా విమానంలోని కార్పెట్(carpet) మొదలైనవాటిని శుభ్రపరచడం అనేది నాలుగు నుండి ఆరు వారాలకు ఒకసారి జరుగుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని విమాన ప్రయాణికులు(passengers) చెప్పులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Updated Date - 2023-04-02T10:34:57+05:30 IST