Wife: కన్న తల్లి గురించి ఓ షాకింగ్ నిజాన్ని పక్కింటికి వెళ్లి మరీ చెప్పిన 9 ఏళ్ల కొడుకు.. అనుమానంగానే వాళ్లంతా ఇంట్లోకి వెళ్లి చూస్తే..
ABN, First Publish Date - 2023-04-19T20:10:19+05:30
పిల్లాడు చెప్పింది వినగానే పక్కింటి వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అనుమానంగానే ఆ పిల్లాడిని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ జరిగిన సంఘటన చూసి అతనికి కరెంట్ షాక్ కొట్టినంత పనయింది
చిన్నపిల్లలు కల్మషం లేని వారు. అది ఎలాంటి విషయం అయినా అందరిముందూ తడబాటు లేకుండా చెప్పేస్తారు. ఓ 9ఏళ్ళ పిల్లాడు రాత్రి సమయంలో పక్కింటికి వెళ్ళాడు. పక్కింటి వ్యక్తి 'ఈ సమయంలో వచ్చావేంటి?' అని పిల్లాడిని దగ్గరకు తీసుకుని అడిగాడు. ఆ పిల్లాడు తన తల్లి ఇంట్లో చేసిన పని గురించి అతనితో చెప్పాడు. పిల్లాడు చెప్పింది వినగానే పక్కింటి వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అనుమానంగానే ఆ పిల్లాడిని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ జరిగిన సంఘటన చూసి అతనికి కరెంట్ షాక్ కొట్టినంత పనయింది. ఊహించని ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రం నైనిటాల్(Nainital) జిల్లా దేవల్ చౌర్ గ్రామంలో రాంపూర్ రోడ్డులో లక్ష్మణ్ సింగ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి పెళ్ళయి 9ఏళ్ళ కొడుకు ఉన్నాడు. ఇతని భార్య గీత గృహిణిగా(house wife) ఉంటూ ఇంటి పనులు చూసుకుంటోంది. లక్ష్మణ్ కు తాగుడు(drinking alcohol) అలవాటు ఉంది. దీనికారణంగా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 1.30గంటల సమయంలో లక్ష్మణ్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అతని భార్య గీత బట్టలు ఉతుకుతోంది. లక్ష్మణ్ తాగిన మత్తులో గీతను నోటికొచ్చినట్టు దుర్భాషలాడాడు. దీంతో గీతకు కోపం వచ్చి అతన్ని తిట్టబోయి, అతను తాగిన మత్తులో ఉన్నాడని గ్రహించి సైలెంట్ అయిపోయింది. ఆమె సైలెంట్ అయిపోయి బట్టలు ఉతకడానికి వెళ్లిపోతుంటే లక్ష్మణ్ ఇగో దెబ్బతినింది. అతను ఆమెను అడ్డుకుని మళ్ళీ ఇష్టానుసారం తిట్డడం మొదలెట్టాడు. ఆమెను గోడకు తోశాడు. గీత గోడకు గుద్దుకుని కింద పడబోయి కర్టెన్ గట్టిగా పట్టుకుంది. అయితే ఆమె బలానికి కర్టెన్ ఊడిపోయి ఇనుప పైప్ కింద పడిపోయింది. లక్ష్మణ్ ఆగకుండా గీతను కొట్టడానికి ముందుకు వచ్చాడు. అయితే గీతకు ఇనుప పైప్(iron pipe) అందుబాటులో ఉండేసరికి దాన్ని తీసుకుని లక్ష్మణ్ తలమీద గట్టిగా కొట్టింది.
Phone Call While Charging: ఫోన్ మాట్లాడేటప్పుడు చార్జింగ్ పెట్టొద్దనేది అందుకే.. ఈ 16 ఏళ్ల కుర్రాడికి ఏం జరిగిందో తెలిస్తే..!
భార్య కొట్టిన దెబ్బకు లక్ష్మణ్ తలపట్టుకుని భారంగా అడుగులేస్తూ మెట్లమీదకు వెళ్లి కూర్చున్నాడు. తలనుండి రక్తమోడుతుండటంతో కొద్దిసేపటికే మరణించాడు. భర్త మరణించడంతో గీత ఆందోళనకు గురైంది. భర్త చనిపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గంటలతరబడి దాచిపెట్టింది. కానీ ఇంట్లో ఉన్న 9ఏళ్ల పిల్లాడు పక్కింటికి వెళ్లి జరిగిన సంగతి మొత్తం చెప్పాడు. పక్కింటి వ్యక్తి అనుమానంగానే ఇంట్లోకి వెళ్ళి చూడగా లక్ష్మణ్ మృతదేహం కనిపించింది. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు.పోలీసులు సంఘనా స్థలానికి చేరుకుని గీతను విచారించగా ఆమె జరిగినదంతా చెప్పి తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులు గీతను అరెస్ట్ చేసి, లక్ష్మణ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Cool Water: ఎండ నుండి ఇంటికి రాగానే చల్లనీళ్లు గడగడా తాగేస్తున్నారా? ఇన్ని సమస్యలు వస్తాయని తెలిస్తే..
Updated Date - 2023-04-19T20:10:19+05:30 IST