Wife and Husband: భార్యాభర్తల మధ్య చిన్న గొడవ.. ఆస్పత్రి పాలయిన 17 మంది.. అదేంటని అవాక్కవుతున్నారా..? అసలేం జరిగిందంటే..!
ABN, First Publish Date - 2023-06-09T17:57:50+05:30
భార్యాభర్తలన్నాక చిన్నచిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవలు అన్నీ నిప్పుమీద నీళ్ళు చిలకరించినట్టు తొందరగా సద్దుమణుగుతాయి. కానీ ఈ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ఏకంగా 17మంది
భార్యాభర్తలన్నాక చిన్నచిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవలు అన్నీ నిప్పుమీద నీళ్ళు చిలకరించినట్టు తొందరగా సద్దుమణుగుతాయి. కానీ ఈ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ఏకంగా 17మంది ఆసుపత్రి పాలయ్యారు. వినడానికి వింతగానూ, మరింత విస్తుపోయేలానూ అనిపిస్తుంది కానీ ఇదే నిజం. అసలేం జరిగింది? భార్యాభర్తల గొడవకు, గాయపడినవారికి గల సంబంధం ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..
రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం ఝులావర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఝలావర్ లో గరీబ్ నవాజ్ కాలనీలో రాజిక్ అన్సారీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను కాంగ్రేస్ కౌన్సిలర్. ఇతని భార్యకు ఇతనికి ఈమధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి గొడవల కారణంగా భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ ఏదోకారణం వలన ఒకే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది(fight between husband and wife). వారిద్దరూ తమ గొడవలో కోపంతో రెచ్చిపోయి ఒకరిని మరొకరు కొట్టుకున్నారు. తరువాత ఉక్రోశంతో తమ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ల ద్వారా సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకోగానే భార్యాభర్తల తరపున బంధువులు వారి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ ఆపి వారిని శాంత పరచాల్సిందిపోయి అక్కడికి వచ్చిన వారు కూడా గొడవలో తలదూర్చారు. వారంతా రెచ్చిపోయి రాళ్లు రువ్వుకుని, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో భార్యాభర్తలిరువురి తరపునుండి 17మంది ఆసుపత్రి పాలయ్యారు.
Viral Video: పాపం.. ఈ బామ్మకు ఈ వయసులో ఇన్ని కష్టాలేంటి..? ఎర్రటి ఎండలో నడుస్తూనే 170 కిలోమీటర్ల ప్రయాణం..!
రాత్రి సమయంలో ఉన్నట్టుండి అరుపులతో గొడవ మొదలైందని, కొద్దిసేపటిలోనే అక్కడ వాతావరణం చాలా గందరగోళంగా మారిందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. గాయపడిన వారిని ప్రైవేట్ వాహనాలలోనూ, అంబులెన్స్ లలోనూ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో కోటా జిల్లా ప్రధానాసుపత్రికి రిఫర్ చేశారు. కాగా భార్యాభర్తలిరువైపు వర్గాలనుండి పోలీసులకు ఫిర్యాదులు వెళ్ళాయి. పోలీసులు ఈ సంఘటన గురించి విచారణ చేస్తున్నారు.
Google Pay: గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్ పే.. కొత్తగా వచ్చిన ఈ స్పెషల్ ఫీచర్ మీకు పనికొస్తుందో లేదో చెక్ చేసుకోండి..!
Updated Date - 2023-06-09T17:59:21+05:30 IST