భర్త గే అని ఆ భార్యకు డౌట్.. నిజమా..? కాదా..? అని నిర్ధారించుకునేందుకు నిఘా.. చివరకు ఆమె ఎంతవరకు వెళ్లిందంటే..
ABN, First Publish Date - 2023-02-22T18:26:18+05:30
ఆ మహిళకు 2019లో వివాహం జరిగింది.. వివాహం తర్వాత ఆమె భర్త ఆమెను దగ్గరకు రానివ్వలేదు.. గట్టిగా అడిగితే అదనపు కట్నం కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించాడు.. కట్నం ఇచ్చే వరకు ముట్టుకునేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు..
ఆ మహిళకు 2019లో వివాహం జరిగింది.. వివాహం తర్వాత ఆమె భర్త ఆమెను దగ్గరకు రానివ్వలేదు.. గట్టిగా అడిగితే అదనపు కట్నం కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించాడు.. కట్నం ఇచ్చే వరకు ముట్టుకునేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు.. అత్తమామలకు చెప్పినా వారు కూడా పట్టించుకోలేదు.. ఇంతలో ఓ పార్టీలో భర్త నిజస్వరూపం బయటపడింది.. తన భర్త అసలు స్వరూపం తెలుసుకుని ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) నైనిటాల్ జిల్లా హల్ద్వానీకి చెందిన ఓ మహిళ తన భర్త స్వలింగ సంపర్కుడని (Homo Sexual)అనుమానించింది. ఎందుకంటే పెళ్లి తర్వాత ఒక్కరోజు కూడా ఆమెను అతడు తాకలేదు. ఆమె ప్రయత్నించినా అతడు దూరం జరిగిపోయేవాడు. గట్టిగా అడిగితే తనకు అదనపు కట్నం కావాలని వేధించేవాడు. అత్తమామలు కూడా కొడుకుకే మద్దతుగా మాట్లాడేవారు. దీంతో ఆమెకు తన భర్తపై అనుమానం మొదలైంది. అతడు స్వలింగ సంపర్కుడేమోనని (Gay) డౌట్ వచ్చింది. అది తెలుసుకునేందుకు అతడిపై నిఘా వేసింది.
మెత్తని పరుపుపై భర్త.. కటిక నేలపై భార్య.. పెళ్లయిన మరుసటి రోజు నుంచి ఇదే తీరు.. పుట్టింటి వాళ్లు మంచం పంపించలేదన్న కోపంతో..
కొన్ని రోజుల క్రితం, బావగారి బిడ్డకు నామకరణం ఫంక్షన్ కోసం కుటుంబ సభ్యులందరూ ఓ హోటల్‌కు వెళ్లారు. పార్టీలో కొద్ది సేపటి తర్వాత ఆమెకు తన భర్త కనిపించలేదు. మొత్తం వెతకగా ఓ గదిలో భర్త కనిపించాడు. అయితే అతడు అప్పుడు తన మగ స్నేహితుడితో అభ్యంతరకరమైన రీతిలో ఉన్నాడు. దీంతో తన భర్త స్వలింగ సంపర్కుడని ఆ మహిళకు స్ఫష్టమైంది (Wife know that her husband is a gay). దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. భర్త, అత్తమమాలు తనను మోసం చేశారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Updated Date - 2023-02-25T20:23:46+05:30 IST