ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: భర్త పుట్టినరోజుకు సర్ఫైజ్ గా విష్ చెయ్యాలని భార్య ప్లాన్.. చెప్పకుండా టౌన్ లో ఉన్న అతని గదికి పిల్లలతో సహా వెళితే..

ABN, First Publish Date - 2023-07-05T18:08:06+05:30

కష్టపడి పనిచేస్తున్న భర్తకు సర్ఫైజ్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ప్లాన్ చేసింది. ఇద్దరు పిల్లలను తీసుకుని భర్త గదికి వెళ్ళింది కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది. వారు ఒకరి పట్ల మరొకరు చూపించే ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేనివి, మీటర్లలో కొలవలేనివి. ఓ మహిళకు తన భర్తంటే వ్లలమాలిన ప్రేమ. ఇద్దరు పిల్లలు పుట్టినా ఆమెకు భర్త మీద అణువంత ప్రేమ కూడా తగ్గలేదు. టౌన్లో కష్టపడి పనిచేస్తున్న భర్తకు సర్ఫైజ్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ప్లాన్ చేసింది. ఇద్దరు పిల్లలను తీసుకుని టౌన్లో భర్త నివసించే గదికి వెళ్ళింది. ఆ తరువాత జరిగిన పరిణామాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం జోధ్ పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జోధ్ పూర్ జిల్లాలోని మథానియా గ్రామంలో, ఉమైద్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న సురేష్ విష్టోయ్(27) కి, పల్లి ధాని గ్రామ నివాసి అయిన బీర్మా(25) అనే యువతికి 2016లో పెద్దల నిర్ణయంతో పెళ్ళి జరిగింది. వీరికి కార్తీక్(5), విశాల్(3) అనే ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. నాలుగేళ్ళు వీరి జీవితం హాయిగా గడిచిపోయింది. 2021లో సురేష్ ఉద్యోగం కోసం గ్రామం వదిలి జోద్ పూర్ వెళ్ళాడు. అక్కడ టాక్సీ డ్రైవర్(Taxi driver) గా పనిచేస్తూ అద్దె గదిలో నివసించేవాడు. గత రెండేళ్ళ నుండి సురేష్ ఎక్కువగా జోధ్ పూర్ లోనే ఉండటంతో బీర్మా అతనితో గొడవపడేది. ఇద్దరి మధ్య గొడవలన్నీ క్లియర్ కావాలనే ఆలోచనతో ఆమె భర్త పుట్టిన రోజున సర్ఫైజ్ గా విష్ చెయ్యాలని అనుకుంది. పుట్టినరోజుకు గ్రామానికి రమ్మని అతన్ని ఎంతగానో రిక్వెస్ట్ చేసింది. కానీ సురేష్ ఒప్పుకోలేదు. దీంతో రాత్రి 12గంటలకు ఫోన్ చేసి విష్ చెయ్యాలని అనుకుంది. ఆమె ఎన్నిసార్లు కాల్ చేసినా అతను లిఫ్ట్ చెయ్యలేదు. దీంతో ఉదయం అవ్వగానే ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని జోధ్ పూర్ బయల్డేరింది.

Viral Video: నది పుట్టడం ఎప్పుడైనా చూశారా? కళ్ళ ముందే ఎంతబాగా నది ఏర్పడిందో చూడండి..


బీర్మా జోధ్ పూర్ లో భర్త నివసించే గది వద్దకు వెళ్ళి తలుపు కొట్టగా సురేష్ తలుపు తీశాడు. ఎదురుగా భార్యాపిల్లలను(Wife and children's) చూడగానే అతను భయపడిపోయాడు, అతని శరీరం చెమటతో నిండిపోయింది. గదిలోకి వెళ్ళిన బీర్మాకు టీ షర్ట్, చెడ్డీ(t-shirt, lower) వేసుకున్న ఓ యువతి కనిపించింది. భర్త ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడని(husband illicit relation) ఆమెకు అర్థమయ్యింది. ఆమె కారణంగానే అతను ఇంటికి రావడానికి ఇష్టపడటం లేదని అనుకుంది. ఆ యువతిని బాగా తిట్టింది. ఆమెకు నాకు ఎలాంటి రిలేషన్ లేదని అతను చెప్పినా బీర్మా నమ్మలేదు. వెంటనే తన మొబైల్ లో ఆ యువతిని, తన భర్తను వీడియో(wife record video) తీసుకుని ఆక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ వీడియోను తన అత్తామామలకు పంపి, మథాని వెళ్లేందుకు బస్సు ఎక్కింది. అయితే ఆమె గ్రామంలోకి వెళ్ళకుండా రైల్వే ట్రాక్ దగ్గరే పిల్లలతో సహా బస్సు నుండి దిగిపోయింది. ఆ తరువాత పిల్లలతో సహా ఫలోడి వైపు నుండి వస్తున్న గూడ్స్ ట్లైన్ ట్రాక్ మీదకు దూకింది(wife jump on railway track with kids). లోకో పైలట్ రైలును ఆపి కొంతమంది వ్యక్తుల సహాయంతో వారిని హాస్పిటల్ కు తరలించినా వారి ప్రాణాలు నిలబడలేదు. ఈ సంఘటన మొత్తం తెలియగానే బీర్మా భర్త సురేష్ పారిపోయాడు. ప్రస్తుతం అతన్ని పట్టుకనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Skin Care: మెడ కింద, చంకల్లో చర్మం నల్లగా, ఎబ్బెట్టుగా ఉందా? కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు మ్యాజిక్కే..


Updated Date - 2023-07-05T18:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising