ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wife: వీడేం భర్తండీ బాబూ.. వాషింగ్ మెషీన్‌లో వేసే ముందు ప్యాంట్ జేబుల్లో ఏమైనా ఉన్నాయా..? అని భార్య వెతుకుతోందని తెలిసి..

ABN, First Publish Date - 2023-04-07T20:27:22+05:30

ఆడవాళ్ళు బట్టలు ఉతికేముందు ప్యాంట్ జేబులు, చొక్కా జేబులు చెక్ చేసి ఆ తరువాత తడినీళ్ళలో వేస్తారు.ఓ మహిళ కూడా ఇదే అలవాటుతో తన భర్త ప్యాంట్ జేబుల్లో ఏమైనా ఉన్నాయేమోనని వెతికింది. ఆమె చేసిన ఆ ఒక్క పనికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సాధారణంగా మగవాళ్లు బట్టలు వదిలేసినప్పుడు ముఖ్యమైన కాగితాలు, డబ్బు అలాగే ప్యాంట్ జేబుల్లో(Pant pockets).. చొక్కా జేబుల్లో(shirt pockets) ఉంచేస్తుంటారు.. ఈ కారణంతోనే ఆడవాళ్ళు బట్టలు ఉతికేముందు ప్యాంట్ జేబులు, చొక్కా జేబులు చెక్ చేసి ఆ తరువాత తడినీళ్ళలో వేస్తారు.ఓ మహిళ కూడా ఇదే అలవాటుతో తన భర్త ప్యాంట్ జేబుల్లో ఏమైనా ఉన్నాయేమోనని వెతికింది. ఆమె చేసిన ఆ ఒక్క పనికి తన భర్త నుండి చాలా దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొంది. నా భర్త ఇలా చేశాడంటూ సోషల్ మీడియో(social media)లో తన బాధను పంచుకుంది. ప్రస్తుతం ఈ మహిళ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈవిషయంపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఆడవారు బట్టలు ఉతికేముందు(before washing) భర్త(husband), పిల్లల(children's) దుస్తుల పాకెట్లలో ఏమైనా కాగితాలు(Important papers), డబ్బు(money) వంటివి ఉన్నాయేమో చూస్తుంటారు. ఒకవేళ పొరపాటున చెక్ చేయకుండా బట్టలు ఉతికేశారే అనుకోండి.. ఆ తరువాత మాటలు పడాల్సింది ఆడవారే.. 'కాస్తయినా చూసుకోవచ్చుగా నేనంటే తొందరపాటులో అలాగే వదిలేశాను, బట్టలు ఉతికేముందు నువ్వయినా చెక్ చెయ్యచ్చుగా' అని ఆడవారినే దోషులుగా నిలబెడతారు. అందుకే మహిళలు పాకెట్ లు చెక్ చేస్తారు. ఓ మహిళ బట్టలు వాషింగ్ మెషిన్(Washing machine) లో వేసేముందు తన భర్త ప్యాంట్ జేబుల్లో ఏమైనా ఉన్నాయేమో అని వెతికింది(checking in husband pant pocket). పాకెట్లో ఓ మడతపెట్టిన కాగితం(Folding paper) కనిపించింది. ఆమె దాన్నిబయటకు తీసిందో లేదో.. ఆమె భర్త అక్కడికి వేగంగా వచ్చాడు. అతను ఆమె చేతిలో కాగితాన్ని గబుక్కున లాక్కుని 'నా ప్యాంట్ జేబులు శోధిస్తున్నావు ఏంటి? నన్ను అనుమానిస్తున్నావు నువ్వు. ముందు ఆ ప్యాంట్ కిందకు వెయ్యి' అని ఆమెను గదమాయించాడు. ఈ హఠాత్పరిణామానికి ఆమె భయపడిపోయింది.వెంటనే అతని ప్యాంట్ కింద వేసింది. అతను వెంటనే ప్యాంటును తీసుకెళ్ళిపోయాడు.

Bride: చేతిపై మెహందీతో వరుడి పేరును రాయకుండా భారీ ట్విస్ట్ ఇచ్చిన వధువు.. ఆమె చేతిపైన రాతలను చదివి అవాక్కైన బంధువులు..!


ఆ మహిళ భర్త దగ్గరకు వెళ్ళి 'కోపంగా ఉన్నారా? నేను బట్టలు ఉతికేముందు ఏమైనా ముఖ్యమైన కాగితాలున్నాయేమోనని చెక్ చేశాను అంతే..' అని చెప్పింది. కానీ అతను ఆమె మాటలు పట్టించుకోలేదు. 'నువ్వు నా పాకెట్లో ముఖ్యమైన కాగితాలు తీస్తున్నావు' అని ఆమెను నిందించాడు. దీంతో ఆమె 'మీ ప్యాంట్ జేబులో నేను బయటకు తీసిన కాగితంలో ఏముంది చూపించండి' అని అడిగింది. కానీ అతను ఆ కాగితం చూపించనని తెగేసి చెప్పాడు. ఆ తరువాత ఆమెతో మాట్లడానికి కూడా అతను ఆసక్తి చూపించలేదు. నువ్వు రహస్యంగా నన్ను చెక్ చేస్తున్నావంటూ అతను ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఆ తరువాత తనకు ప్రత్యేకంగా లాకర్ సదుపాయం ఉన్న కాబోర్డ్(kabord) ఒకటి కొనుగోలు చేసి అందులోకి తన దుస్తులను సర్దుకున్నాడు. ఇదంతా జరిగిన తరువాత ఆమె రెడ్డిట్(Reddit) అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నా భర్త ఇలా చేశాడంటూ తన బాధను పంచుకుంది. ఈ విషయం పై నెటిజన్లు చాలావరకు మహిళకే మద్దతుగా నిలిచారు. 'అతను మీ దగ్గర ఏదో దాస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది' అని కొందరు అన్నారు. 'అతనికి మీ మీద అనుమానం ఉంటే ఎంచక్కా అతని బట్టలు అతనే ఉతుక్కోవచ్చు' అని మరికొందరు భర్తమీద సెటైర్లు వేశారు. 'అందరి ఆడవాళ్లలాగే మీరూ చేశారు. ఇందులో మీ తప్పేం లేదు' అంటూ ఆమెను ఓదార్చారు. అయితే మరొక వైపు కొందరు మహిళలు మాత్రం 'భర్తల పాకెట్స్ తీయడం ఎందుకు? నేనెప్పుడూ అలా తీయలేదని ఒకరు, మా పెళ్లై 20ఏళ్ళయినా మా వస్తువులు ఒకరినొకరం తాకమని ఆ మహిళ చేసింది తప్పనే ధోరణిలో కామెంట్స్ చేశారు.

Lottery Grand Prize: రూ.44 కోట్లు గెలిచారని ఫోన్ చేస్తే.. సైబర్ నేరగాళ్లేమో అని నెంబర్‌ను బ్లాక్ చేశాడు.. నిజమేనని ఆలస్యంగా తెలిసి..!


Updated Date - 2023-04-07T20:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising