Wife-Husband: బాబోయ్.. ఇదెక్కడి యవ్వారం.. భర్త బాత్రూంలోకి వెళ్లినా ఆ భార్యకు డౌటే.. ఏం చేయాలని అతడు అడిగితే..!
ABN, First Publish Date - 2023-07-06T13:48:45+05:30
ఎలా మొదలైందో ఏమో కానీ భార్యకు భర్తమీద అనుమానం మొదలైంది. 'నేను మంచోన్నే తల్లీ.. నన్ను అనుమానించకు' అని అతను మొత్తుకున్నా ఆమె వినలేదు చివరికి..
భార్యాభర్తల బంధం ఒకరికొకరు ఇచ్చే ప్రాధాన్యత, ఒకరి మీద మరొకరికి ఉండే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య దాపరికాలు ఏమీ లేకుంటే అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ ఒకరిమీద మరొకరికి అనుమానం మొదలైతే మాత్రం ఆ బంధంలో ఇబ్బందులు మొదలవుతాయి. చివరికది నరకంగా కూడా మారుతుంది. సాధారణంగా భార్యలకు భర్తలమీద ఒకింత అనుమానం ఉంటుంది. ఓ భార్యకు తన భర్తమీద ఇదే అనుమానం ఏర్పడింది. చివరికి అతను బాత్రూంలోకి వెళ్లినా అతన్ని అనుమానించడం మొదలుపెట్టింది. 'నేను మంచోన్నే తల్లీ.. నన్ను అనుమానించకు' అని అతను మొత్తుకున్నా వినలేదు. 'నా పరిస్థితి ఇది, నేనిప్పుడు ఏం చేయాలి?' అంటూ ఆ భార్యా భాదితుడు సోషల్ మీడియాలో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
స్వర్గానికైనా, నరకానికైనా భార్యాభర్తల బంధమే మంచి ఉదాహరణ. భార్యాభర్తలు సంతోషంగా ఉంటే ఆ బంధం స్వర్గంలాగే(good relation like heaven) ఉంటుంది. అదే అనుమానాలు మొదలైతే మాత్రం అది నరకప్రాయమే(bad relation like hell). 34ఏళ్ల(34 years man) రాహుల్ అనే వ్యక్తికి 5ఏళ్ళ కిందట పెళ్ళయింది. అతని భార్య వయసు 33ఏళ్ళు. పెళ్ళయిన ఒకటి రెండేళ్ళ వరకు వారి బంధం బానే ఉంది. కానీ ఎలా మొదలైందో ఏమో కానీ భార్యకు భర్తమీద అనుమానం(wife suspicious husband) మొదలైంది. అతను దగ్గరలో లేనప్పుడు అతని ఫోన్ చూడటం, అతని పర్స్ లు, చొక్కా, ఫ్యాంటు జేబులు చెక్ చేయడం చేసేది. ఇంట్లోనే అతను ఒక్కడే గదిలోకి వెళ్ళినా, హాల్ లో కూర్చున్నా, చివరికి బాత్రూంలోకి వెళ్ళినా అతనేం చేస్తున్నాడో అనే అనుమానంతో అతన్ని అనుసరించేది. ఇవన్నీ అతని కంట పడనే పడ్డాయి. దీంతో అతను ఆమెతో 'నేను మంచోన్నే తల్లీ.. నామీద నీకు ఎందుకంత అనుమానం? నన్ను అనుమానించకు' అని మొత్తుకున్నాడు.
Viral Video: నది పుట్టడం ఎప్పుడైనా చూశారా? కళ్ళ ముందే ఎంతబాగా నది ఏర్పడిందో చూడండి..
అతను ఒకటికి పది సార్లు 'నన్ను అనుమానిస్తున్నావెందుకు? నేను నీకు ద్రోహం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు, నువ్వలా ఫీలవ్వకు' అని ఆమెతో చెప్పినా ఆమె సింపుల్ గా నవ్వేసి అక్కడినుండి తప్పించుకుని వెళ్ళిపోతుంది తప్ప ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన అతను 'నాకు ఆమె ప్రవర్తన అర్థం కావడంలేదు, నేను ఆమెను ఎదుర్కోలేకపోతున్నాను. ఇప్పుడేం చెయ్యాలో తెలియడంలేదు, ఏదైనా పరిష్కారం చెప్పండి అంటూ సోషల్ మీడియా వేదికగా తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఇతని సమస్య చూసిన ఓ సైకియాట్రిస్ట్(psychiatrist) ఇతనికి సమాధానం ఇచ్చాడు. 'రాహుల్ మీరు మీ భార్యను పట్టించుకోవడం లేదు, అవసరమైనదానికంటే ఎక్కువగా మొబైల్ లో గడుపుతున్నారేమో చెక్ చేసుకోండి. ఏ భార్యా తన భర్తను కావాలని అనుమానించదు. మీరు వీలైనంత ఎక్కువ సమయం మీ భార్యతో గడపడానికి ప్రయత్నించండి. ఇవన్నీ చేశాక సమస్య పరిష్కారం కాకపోతే ఆమెకు నిజంగానే అనుమానం అనే జబ్బు వచ్చినట్టు భావించవచ్చు. అప్పుడు మీరు ఆమెను మానసిక వైద్యుని వద్దకు తీసుకెళ్ళండి' అంటూ సలహా ఇచ్చాడు.
Wife: భర్త పుట్టినరోజుకు సర్ఫైజ్ గా విష్ చెయ్యాలని భార్య ప్లాన్.. చెప్పకుండా టౌన్ లో ఉన్న అతని గదికి పిల్లలతో సహా వెళితే..
Updated Date - 2023-07-06T14:22:04+05:30 IST