ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

WhatsApp: వాట్సప్ యూజర్లకు కొత్త టెన్షన్.. ఇకపై వాట్సప్‌ను వాడాలంటే డబ్బులు కట్టాల్సిందేనా..!?

ABN, First Publish Date - 2023-11-13T18:47:22+05:30

స్మార్ట్‌ఫోన్లు, డేటా వాడకం బాగా పెరిగిన తర్వాత అందరూ తప్పని సరిగా ఉపయోగిస్తున్న యాప్ వాట్సప్. మెసేజ్‌లు మాత్రమే కాకుండా.. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు సులభంగా పంపించుకునే వీలుండడంతో దాదాపు స్మార్ట్‌ఫోన్ యూజర్లందరూ దీనిని ఉపయోగిస్తుంటారు.

స్మార్ట్‌ఫోన్లు (Smart Phones), డేటా (Data) వాడకం బాగా పెరిగిన తర్వాత అందరూ తప్పని సరిగా ఉపయోగిస్తున్న యాప్ వాట్సప్ (WhatsApp). మెసేజ్‌లు మాత్రమే కాకుండా.. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు సులభంగా పంపించుకునే వీలుండడంతో దాదాపు స్మార్ట్‌ఫోన్ యూజర్లందరూ దీనిని ఉపయోగిస్తుంటారు. వాట్సప్ లేకుండా చాలా మందికి రోజువారీ పనులు చేయడం కూడా కష్టమే. ఇప్పటివరకు వినియోగదారులందరూ వాట్సప్‌ను ఉచితంగానే వాడుకున్నారు. అయితే ఇలా ఎంతో కాలం కుదరదని వాట్సప్ మాతృ సంస్థ అయిన మెటా (Meta) ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది.

ఎక్కువ కాలం ఉచిత సేవలను అందించలేమని మెటా ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. వాట్సప్ ద్వారా ఆదాయం పొందడానికి సంస్థ పలు మార్గాలను అన్వేషిస్తోంది. వాట్సప్‌లో యాడ్స్‌ను (Ads in WhatsApp) చూపించడం ద్వారా ఆదాయం పొందాలని మెటా భావిస్తోంది. యాడ్స్ లేకుండా వాట్సప్ కావాలనుకుంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ (Subscription) పొందాల్సి ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ లేకుండా వాట్సప్‌ను ఉపయోగించాలనుకుంటే మాత్రం ప్రకటనలను చూడాల్సిందే. అతి త్వరలోనే వాట్సప్ ఉచిత సేవలు ఆగిపోతాయని వార్తలు వస్తున్నాయి (Viral News).

Viral News: సిటీల్లో అపార్ట్మెంట్లలో ఉంటున్నారా..? ఈ బిల్డింగ్‌లోని బాల్కనీలు ఎలా కూలిపోయాయో తెలిస్తే..!

భారతదేశంలో యాడ్స్‌ను ఎప్పుటి నుంచి డిస్‌ప్లే చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ముందు అమెరికా, కెనడాల్లో దీనిని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, ఫేస్‌బుక్లో ప్రకటనలు కనిపించినట్టుగానే వాట్సాప్‌లో కూడా ప్రకటనలు కనిపిస్తాయని సమాచారం. ఆ ప్రకటనలు వద్దనుకునేవారు మాత్రం సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బులు కట్టాల్సి ఉంటుంది.

Updated Date - 2023-11-13T18:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising