ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: పెళ్లిలో ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‌కు 4ఏళ్ల తర్వాత పెళ్లికూతురి నుంచి మెసేజ్.. ఆ తర్వాత ఆమె అడిగిన విషయంతో అతడి ఫీజులు ఎగిరిపోయాయి..

ABN, First Publish Date - 2023-05-09T11:23:00+05:30

ఓ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌ (Wedding Photographer) ఇటీవల తనకు ఎదురైన వింత అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌ (Wedding Photographer) ఇటీవల తనకు ఎదురైన వింత అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం అతడు ఓ పెళ్లిలో ఫొటోలు తీశాడట. తీరా.. ఇప్పుడు ఆ పెళ్లికూతురు మనోడి ఫోన్ నెంబర్‌కు ఓ మెసేజ్ పెట్టింది. అది చదివిన ఫొటోగ్రాఫర్‌కు ఫీజులు ఎగిరిపోయాయి. ఆమె అడిగిన విషయంతో మనోడికి మొదటనోట మాటరాలేదట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాఫ్రికాలోని శాండ్‌టన్ నగరంలో ఉండే ఓ ఫొటోగ్రాఫర్ 2019లో స్థానికంగా జరిగిన ఓ పెళ్లిలో ఫొటోలు, వీడియో తీశాడు. దానికి కొంత మొత్తం తీసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, నాలుగేళ్ల తర్వాత తాజాగా అతడి మొబైల్ నంబర్‌కు పెళ్లికూతురి నుంచి ఓ సందేశం వచ్చింది.

'హాయ్ మీరు మా పెళ్లిలో ఫొటో షూట్ చేశారు. మీకు గుర్తుందనుకుంటా' అని తనను తాను పరిచయం చేసుకుందామె. దాంతో ఫొటోగ్రాఫర్ 'అవును గుర్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నారు. అంతా ఓకేనా అంటూ' రిప్లై ఇచ్చాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఉంది చూడండి. మనోడికి దిమ్మ తిరిగేలా చేసింది. 'అంతా బాగానే.. ప్రస్తుతం మాకు విడాకులు అయ్యాయి. మా పెళ్లిలో నీవు తీసిన ఫొటోలు నిజంగా చాలా సూపర్బ్. కానీ, ఇప్పడు వాటితో నాకు పనిలేదు. అవి నాకు అవసరం లేదు కూడా. కనుక మా పెళ్లిలో ఫొటో షూట్ కోసం నీవు తీసుకున్న డబ్బులు రిఫండ్ చేస్తే బాగుంటది' అని బాంబు పేల్చింది. మొదట ఏదో జోక్ చేస్తుందిలే అనుకున్నాడు మనోడు. కానీ, ఆ తర్వాత ఆమె సీరియస్‌గానే మనీ రిఫండ్ చేయాల్సిందేనని, లేకపోతే తన లాయర్‌తో కోర్టుకు లాగుతానని చెప్పడంతో మనోడికి మైండ్‌బ్లాక్ అయింది. ఇలా ఆమెతో చేసిన ఆ చాట్‌ తాలూకు స్క్రీన్‌షాట్‌లను ఫొటోగ్రాఫర్ నెట్టింట పెట్టడంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Software Engineer: 48 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. 8 రోజుల్లోనే రూ.34 లక్షలు మటాష్.. అసలేం జరిగిందని పోలీసులు అడిగితే..!


Updated Date - 2023-05-09T11:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising