Aeroplane: విమానంలో షాకింగ్ ఘటన.. సీటు దగ్గర రక్తపు మరకలు.. సిబ్బందికి చెబితే మీరే తుడుచుకోండంటూ..!
ABN, First Publish Date - 2023-12-05T11:47:27+05:30
Shocking Incident in Aeroplane: కెనడాకు చెందిన ఎయిర్ ట్రాన్సాట్ (Air Transat) విమానంలో ఓ ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె కూర్చున్న సీటు దగ్గర రక్తపు మరకలు కనిపించాయి. దాంతో ఆమె వెంటనే విమాన సిబ్బందికి విషయాన్ని తెలియజేసింది.
Shocking Incident in Aeroplane: కెనడాకు చెందిన ఎయిర్ ట్రాన్సాట్ (Air Transat) విమానంలో ఓ ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె కూర్చున్న సీటు దగ్గర రక్తపు మరకలు కనిపించాయి. దాంతో ఆమె వెంటనే విమాన సిబ్బందికి విషయాన్ని తెలియజేసింది. దానికి సిబ్బంది ఇచ్చిన షాకింగ్ సమాధానంతో మహిళకు నోటమాట రాలేదు. ఇక విమానంలో తనకు ఎదురైన షాకింగ్ అనుభవం గురించి ఆమె తన 'ఎక్స్' (ట్విటర్) ద్వారా పంచుకోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
Viral Video: బస్సులో వెనుక సీట్లో కూర్చుని సీక్రెట్‌గా తీసిన వీడియో.. ఈ వ్యక్తి చేసేది చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం..!
వివరాల్లోకి వెళ్తే.. బిర్జిత్ ఉమైగ్బా ఓమోరును (Birgit Umaigba Omoruyi) అనే మహిళ ఇటీవల ఎయిర్ ట్రాన్సాట్ (Air Transat) విమానంలో ప్రయాణించింది. అయితే, విమానంలో తనకు కేటాయించిన సీటు ముందు ఆమెకు షాకింగ్ దృశ్యం కనిపించింది. సీటుపై రక్తపు మరకలు కనిపించాయి. దాంతో ఆమె వెంటనే సిబ్బందికి విషయాన్ని తెలియజేసింది. బిర్జిత్ ఉమైగ్బా దగ్గరికి వచ్చిన విమాన సిబ్బంది మరకలను చూశారు. ఆ తర్వాత క్రిమిసంహారక వైప్స్ (Disinfectant wipes) ఆమె చేతికి ఇచ్చి, ఆ మరకలను మీరే తుడుచుకోండంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారట. దాంతో చేసేదేమిలేక ఆమె తన చేతులతోనే ఆ రక్తపు మరకలను వైప్స్‌తో క్లీన్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక తనపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విమాన సిబ్బందిపై ట్విటర్ వేదికగా ఆమె చురకలు అంటించారు.
Bank Robbery: సడన్‌గా బ్యాంకులోకి దూరిన ముసుగు ముఠా.. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి రూ.18 కోట్లు కొట్టేశారు..
"ఈ సంఘటనకు సంబంధించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నేను కూర్చున్న ముందు సీటుపై రక్తపు మరకలు కనిపిస్తే.. మీ సిబ్బందికి చెప్పాను. వెంటనే నా చేతికి వైప్స్ ఇచ్చి వాటిని క్లీన్ చేసుకోమంటూ మీ సిబ్బంది వెళ్లిపోయారు. నేనే వాటిని నా చేతులతో తుడిచాను. నెక్ట్స్ టైమ్ మీ విమానం మొత్తం శుభ్రం చేయాలన్నా.. నన్ను పిలవండి. ఫ్రీగానే క్లీన్ చేసి పెడతాను. అప్పుడైనా ఇలాంటి ఘటనలు పునరవృతం కాకుండా ఉంటాయి" అని బిర్జిత్ ఉమైగ్బా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
UK visa rules: రిషి సునాక్ సంచలన నిర్ణయం.. వీసా నిబంధనలు మరింత కఠినతరం.. భారతీయులపై ఎఫెక్ట్
Updated Date - 2023-12-05T11:47:28+05:30 IST