ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: పబ్లిక్‌గా పోలీసుపై రెచ్చిపోయిన మహిళ.. వద్దు వద్దు అంటున్నా వినకుండా.. వైరల్ వీడియో

ABN, First Publish Date - 2023-10-13T21:05:57+05:30

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఈ-రిక్షా డ్రైవర్ స్థానిక పోలీసుపై చేయి చేసుకుంది. ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉన్న ఆమె వాహనాన్ని పక్కకు తీయమన్నందుకు ఆమె పోలీసుతో వాగ్వాదానికి దిగి ఆపై చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: నడివీధిలో ఓ పోలీసుపై మహిళ చేయిచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) ఘాజియాబాద్(Ghaziabad) జిల్లాలో ఈ ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, సదరు మహిళ తరచూ ఇతరులతో వాగ్వాదాలకు దిగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఆమె ఓ ఈ రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. ఈ క్రమంలో మంగళవారం ఇందిరాపురమ్ ప్రాంతంలో ఓ పోలీసుతో ఆమె దురుసుగా ప్రవర్తించింది.

Viral: పట్టెడన్నం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నావ్! ఈ కష్టం ఎవరికీ రాకూడదు బ్రో.. షాకింగ్ వీడియో!

ఇది చాలదన్నట్టు అతడిని మహిళ చెప్పుతో కొట్టింది(E-rickshaw driver slaps police). అతడు వద్దు వద్దు అని వారిస్తున్నా వినకుండా పదే పదే చేయిచేసుకుంది. మహిళ చేయి చేసుకుంటుంటే పోలీసు రక్షణగా పలుమార్లు చేయి అడ్డం పెట్టిన దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. చివరకు ఆ పోలీసుల అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

Viral: నన్నేం చేయమంటారో మీరైనా చెప్పండి..నెట్టింట వ్యక్తి అర్థింపు.. ఆన్‌లైన్‌లో ల్యాప్‌‌టాప్ ఆర్డరిచ్చాక..


ఈ వీడియో నెట్టింట వైరల్(Viral Video) కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మహిళ సదరు పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించిందని సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ-రిక్షాల కారణంగా ఆ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ ఆటంకాలు ఏర్పడుతుండటంతో తమకు ఫిర్యాదులు వెల్లువెత్తాయని చెప్పారు. ఈ క్రమంలో తన వాహనాన్ని పక్కకు జరపమని పోలీసు మహిళకు సూచించడంతో వివాదం మొదలైందని తెలిపారు. మాటవినకపోగా ఆమె దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించిందని అన్నారు. గతంలో కూడా ఆమె పలుమార్లు ఇలాగే ప్రవర్తించిందని చెప్పారు. ఘటనపై ఫిర్యాదు నమోదైందని, ఈ కేసులో ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

Viral: భార్యాపిల్లలతో పాటూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన వ్యక్తిని చూసి సిబ్బంది షాక్.. అతడేం చేశాడంటే..

Updated Date - 2023-10-13T21:10:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising