ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: టికెట్లు బుక్ చేసుకున్నాక.. బయటపడ్డ భర్త వివాహేతర సంబంధం.. ఆ భార్య చేసిన పనితో పేలుతున్న సెటైర్లు..!

ABN, First Publish Date - 2023-11-24T17:11:25+05:30

యూరోపియన్ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ అయిన ర్యానైర్‌లో ప్రయాణించేందుకు ఓ మహిళ తనకు, తన భర్తకు టికెట్లు బుక్ చేసుకుంది. అయితే విమాన ప్రయాణానికి కొద్ది సేపటి ముందు ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. తన భర్తకే వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుసుకుంది.

యూరోపియన్ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ అయిన ర్యానైర్‌ (Ryanair )లో ప్రయాణించేందుకు ఓ మహిళ తనకు, తన భర్తకు టికెట్లు బుక్ చేసుకుంది. అయితే విమాన ప్రయాణానికి కొద్ది సేపటి ముందు ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. తన భర్తకు (Husband) వేరే మహిళతో వివాహేతర సంబంధం (Affair) ఉన్నట్టు తెలుసుకుంది. షాకైన మహిళ తన భర్తతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడలేదు. తన టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వడం కుదురుతుందా? అంటూ ఎయిర్‌లైన్స్ సంస్థను కోరింది. ఆ మహిళ ప్రశ్నకు ఎయిర్‌లైన్స్ సంస్థ స్పందించిన విధానం వైరల్ (Viral) అవుతోంది.

కార్లీ అనే మహిళ ర్యానైర్‌లో ప్రయాణించేందుకు తనకు, తన భర్తకు టికెట్లు బుక్ చేసుకుంది. అయితే తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు కార్లీ తెలుసుకుంది. దీంతో ఆ జర్నీని క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ``ఎక్స్`` (Twitter) ద్వారా ర్యానైర్‌ను సంప్రదించి ``హాయ్ ర్యానైర్.. నా భర్తతో కలిసి ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకున్నా. అతడికి వేరే మహిళతో అఫైర్ ఉందని ఇప్పుడే తెలిసింది. మీరు టికెట్లు క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇవ్వగలరా? లేదా నా సీటు మార్చగలరా?`` అని అడిగింది.

కార్లీ ప్రశ్నకు ర్యానైర్ సంస్థ ఇచ్చిన రిప్లై చాలా ఫన్నీగా ఉంది. ``ఎమోషనల్ బ్యాగేజీకి అదనపు ఖర్చులు చెల్లించాలి కార్లీ`` అని రిప్లై ఇచ్చింది. ఈ రిప్లపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ``ఎమోషనల్ బ్యాగేజీ అత్యంత భారమైనది. అదనపు బ్యాగేజీ రుసుము వసూలు చేయాలి``, ``ఇది ఆన్‌లైన్‌లో ఉత్తమ కస్టమర్ ఫీడ్``, ``Ryanair ల్యాండింగ్‌ల కంటే కఠినమైనది వారి ట్విట్టర్ రిప్లై``, ``చాలా క్రూరమైన రిప్లై`` అంటూ నెటిజన్లు స్పందించారు.

Updated Date - 2023-11-24T17:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising