ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: గర్భవతినయ్యానని జాబ్‌లోంచి తీసేశారంటూ న్యాయపోరాటం.. రూ.36 లక్షలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు

ABN, First Publish Date - 2023-08-28T16:35:19+05:30

ఆ మహిళ లండన్‌లోని ఓ జపనీస్ రెస్టారెంట్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగంలో జాయిన్ అయింది.. కొద్ది నెలల తర్వాత ఆమె గర్భం దాల్చింది.. ఆ విషయాన్ని మేనేజర్‌కు చెబితే అతడు షాకయ్యాడు.. గర్భవతి తన రెస్టారెంట్‌లో పని చేయడం బాగుండదని ఫీలయ్యాడు.. అప్పట్నుంచి ఆమెను వేధించడం ప్రారంభించాడు..

ఆ మహిళ లండన్‌ (London)లోని ఓ జపనీస్ రెస్టారెంట్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగంలో జాయిన్ అయింది.. కొద్ది నెలల తర్వాత ఆమె గర్భం (Pregnancy) దాల్చింది.. ఆ విషయాన్ని మేనేజర్‌కు చెబితే అతడు షాకయ్యాడు.. గర్భవతి తన రెస్టారెంట్‌లో పని చేయడం బాగుండదని ఫీలయ్యాడు.. అప్పట్నుంచి ఆమెను వేధించడం ప్రారంభించాడు.. ఆమె జీతం తగ్గించాలని ప్రతిపాదించాడు.. ఆమెను తమ బ్రాంచ్‌కు చెందిన వేరే స్టోర్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు.. బాస్ వేధింపులు తట్టుకోలేక రిజైన్ చేసిన మహిళ ఎంప్లాయ్ ట్రిబ్యునల్‌ (Employment tribunal)ను ఆశ్రయించింది.

32 ఏళ్ల పౌలినా బావేజ్‌ అనే మహిళ లండన్‌లోని సుషినోయెన్ (Sushinoen) అనే రెస్టారెంట్‌లో 2018లో అసిస్టెంట్ మేనేజర్‌గా జాయిన్ అయింది. 2019లో పౌలినా గర్భం దాల్చింది. ఆ విషయం తెలుసుకుని మేనేజర్ హువాంగ్ దిగ్భాంతికి గురయ్యాడు. వెంటనే ఆమెను ఉత్తర లండన్‌లోని గోల్డర్స్ గ్రీన్‌లో ఉన్న తైషో జపనీస్ రెస్టారెంట్‌కు బదిలీ చేశాడు. అంతేకాదు ఆమె జీతం బాగా ఎక్కువగా ఉందని చెప్పి 4 లక్షల యూరోలు కోత విధించాడు. మేనేజర్ ఉద్దేశం అర్థం చేసుకున్న బావేజ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది (Viral News).

Viral: కరోనా వల్ల భార్య, కొడుకు మృతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన కోడలి నుంచి జీవనభృతి కోరుతూ ఆ మామ కోర్టుకెళ్తే..!

ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ప్రెగ్నెన్సీ వివక్ష మరియు తప్పుడు తొలగింపునకు దావా వేసింది. ఆ కేసును విచారించిన ట్రిబ్యునల్ రెస్టారెంట్ యాజమాన్యంది తప్పు అని నిర్ధారణకు వచ్చింది. బావేజ్‌కు రూ.36 లక్షల జరిమానా చెల్లించాలని అదేశించింది.

Updated Date - 2023-08-28T17:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising