Viral News: 5 ఏళ్ల క్రితం పెళ్లి కాకముందు నా భర్త పంపిన మెసేజ్ ఇదేనంటూ ఓ భార్య బయటపెట్టిన సీక్రెట్.. నెట్టింట బిగ్ డిబేట్..!
ABN, First Publish Date - 2023-09-25T19:29:10+05:30
ప్రస్తుతం సోషల్ మీడియా ఎన్నో ప్రేమ కథలకు అడ్డాగా మారింది. ఎన్నో అందమైన ప్రేమకథలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ మహిళ తన ప్రేమకథకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్‌లో షేర్ చేసింది. ఆ ఛాట్ చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా ఎన్నో ప్రేమ కథలకు అడ్డాగా మారింది. ఎన్నో అందమైన ప్రేమకథలు (Cute Love Stories) సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ మహిళ తన ప్రేమకథ (Love Story)కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్ (Twitter)లో షేర్ చేసింది. ఆ ఛాట్ (Chat) చాలా మందిని ఆకట్టుకుంటోంది. @samxrzraf అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ స్క్రీన్ షాట్ షేర్ అయింది. ఆమె తన వెడ్డింగ్ ఫోటోను షేర్ చేసి పక్కనే చాటింగ్‌ను షేర్ చేసింది.
ఆ ఛాట్‌లో ఐదేళ్ల క్రితం ఆ యువతికి ఓ యువకుడు ప్రపోజ్ చేశాడు (Five years back Chating). ``నేను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నానని చెప్పాలనుకుంటున్నా. నువ్వంటే ఎంతో ఎంతో ఇష్టం`` అని మెసేజ్ చేశాడు. దానికి ఆ యువతి స్పందిస్తూ.. ``ఓమైగాడ్.. అది నిజం కాదు. నన్ను నమ్ము`` అని రిప్లై ఇచ్చింది. ఆ ఛాట్‌ను తాజాగా ట్విటర్‌లో షేర్ చేసిన యువతి.. ``అతడు నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడని ఐదేళ్లు ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే తెలిసింది`` అంటూ కామెంట్ చేసింది. వారి లవ్‌స్టోరీ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.
Indian Railway: ఏం తెలివి గురూ.. కిక్కిరిసిపోయిన రైలు.. కూర్చోడానికి సీటు కూడా లేని చోట ఏకంగా పడుకునేందుకు వెరైటీ ప్లాన్..!
ఆమె చేసిన ట్వీట్‌ను ఇప్పటివరకు దాదాపు 4.9 లక్షల మంది లైక్ చేశారు. ఎంతో మంది ఈ ట్వీట్‌పై తమ స్పందనలను తెలియజేశారు. ``క్యూట్.. నేను కూడా అలాంటి మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నా``, ``ఆగండి.. ఇప్పుడు నేను కూడా నా ఛాటింగ్‌ను చెక్ చేసుకుంటున్నా``, ``చాలా అందంగా ఉంది.. మీ ఇద్దరికీ కంగ్రాట్స్``, ``మీ మెసేజ్ తర్వాత అతడు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-09-25T19:29:10+05:30 IST