ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parents: లెక్కల పరీక్షలో కూతురికి సున్నా మార్కులు.. జవాబు పత్రంపై సంతకం పెట్టి ఆ బాలిక తల్లి ఏం రాసిందో చదివితే..!

ABN, First Publish Date - 2023-08-28T18:46:09+05:30

పరీక్షా పత్రాలపై తమ తల్లిదండ్రుల సంతకం తీసుకునేందుకు ప్రతి విద్యార్థి ఏదో ఒక దశలో ఇబ్బంది పడే ఉంటాడు. ముఖ్యంగా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినపుడు తల్లిదండ్రులు ఏమంటారో అని ఆ పిల్లలు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. తమ పిల్లలకు తక్కువ మార్కులు రావడాన్ని ఏ తల్లీ భరించలేదు.

పరీక్షా పత్రాలపై (Exam Papers) తమ తల్లిదండ్రుల (Parents) సంతకం తీసుకునేందుకు ప్రతి విద్యార్థి ఏదో ఒక దశలో ఇబ్బంది పడే ఉంటాడు. ముఖ్యంగా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినపుడు తల్లిదండ్రులు ఏమంటారో అని ఆ పిల్లలు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. తమ పిల్లలకు తక్కువ మార్కులు రావడాన్ని ఏ తల్లీ భరించలేదు. తాజాగా ఓ ట్విటర్ వినియోగదారు తన ఆరో తరగతి గణితం పరీక్షా (Maths Exam) పత్రాన్ని షేర్ చేసింది. ఆ పరీక్షలో ఆమెకు సున్నా మార్కులు వచ్చాయి. అప్పుడు తల్లి (Mother) చేసిన పనిని ఆ యువతి తాజాగా గుర్తు చేసుకుంది.

@zaibannn అనే ట్విటర్ వినియోగదారు షేర్ చేసిన ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ (Viral tweet) అవుతోంది. ``ఆరో తరగతిలో ఉన్నప్పుడు నాకు గణితంలో సున్నా మార్కులు వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చిన ప్రతిసారీ నా తల్లి నన్ను ప్రోత్సహిస్తూ రాసిన రాతలను, ఆమె ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేన``ని ఆమె కామెంట్ చేసింది. 15 మార్కులకు సున్నా మార్కులు వచ్చిన ప్రశ్నా పత్రంపై ఆమె తల్లి సంతకం పెడుతూ.. ``ఇలాంటి మార్కులు సొంతం చేసుకునేందుకు చాలా ధైర్యం కావాలి`` అని రాసింది.

Viral: గర్భవతినయ్యానని జాబ్‌లోంచి తీసేశారంటూ న్యాయపోరాటం.. రూ.36 లక్షలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు

``ఆ తర్వాత నేను గణితాన్ని బాగా అధ్యయనం చేశాను. మంచి మార్కులు సాధించాను. మీ పిల్లలు ఫెయిల్ అయినందుకు మీరు సిగ్గుపడకుండా ధైర్యం చెబితేనే ఇలా జరుగుతుంది`` అని ఆమె మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు దాదాపు 90 వేల మంది వీక్షించారు. ఎంతో మంది తమ అనుభవాలు చెబుతూ కామెంట్లు చేశారు. ``ప్రస్తుత తరం పిల్లలు చాలా సెన్సిటివ్‌గా ఉంటున్నారు. అలాంటి తల్లి అందరికీ అవసరం`` అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Updated Date - 2023-08-28T18:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising