ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Punjab Woman: హద్దుమీరిన యువతి.. కారు బొనెట్‌పై కూర్చొని స్టంట్స్.. బుద్ధి చెప్పిన కాప్స్

ABN, First Publish Date - 2023-08-04T15:43:39+05:30

లైక్స్, ఫాలోవర్స్ కోసం ఇన్స్‌ఫ్లుయెన్సర్లు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. సాధారణ వీడియోలు పెద్దగా వైరల్ అవ్వవు కాబట్టి.. హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. కొందరు పిచ్చి గెంతులు వేస్తే, మరికొందరు ఒక అడుగు ముందుకేసి భయంకరమైన స్టంట్స్ చేస్తుంటారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమని, ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా సరే..

లైక్స్ & ఫాలోవర్స్ కోసం సోషల్ మీడియా ఇన్స్‌ఫ్లుయెన్సర్లు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. సాధారణ వీడియోలు పెద్దగా వైరల్ అవ్వవు కాబట్టి.. రొటీన్‌కి భిన్నంగా చేయాలని అనుకుంటారు. అయితే.. ఈ క్రమంలో కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. భయంకరమైన స్టంట్స్ చేస్తుంటారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమని, ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా సరే.. ఉద్దేశపూర్వకంగానే స్టంట్ వీడియోలు చేస్తారు. తామేదో గొప్ప పనులు చేస్తున్నామన్నట్టుగా బిల్డప్పులకు పోతుంటారు. ఇప్పుడు ఓ యువతి కూడా అలాగే హద్దుమీరింది. కారు బొనెట్‌పై కూర్చొని, వీడియో షూట్ చేసింది. అది వైరలై పోలీసుల కంట పడటంతో.. వాళ్లు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

సోషల్ మీడియా ఇన్స్‌ఫ్లుయెన్సర్ అయిన గౌరీ విర్దీ (25).. ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా 1 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ.. ఒక వీడియో తీసింది. అయితే.. రొటీన్‌గా కాకుండా భిన్నంగా చేయాలని నిర్ణయించుకుంది. కదులుతున్న ‘థార్’ కారు బొనెట్‌పై కూర్చొని.. తాను 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించానంటూ ఓవరాక్షన్ చేసింది. ఈ వీడియోని ఆ కారుకి ఎదురుగా వెళ్తున్న కారులో ఉన్న మరో వ్యక్తి షూట్ చేశాడు. దసుయకి సమీపంలో ఉన్న జలంధర్-జమ్ము నేషనల్ హైవేలో ఈ వీడియోని షూట్ చేశారు. ఈ వీడియోని గౌరీ ఇన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే.. వెంటనే వైరల్ అయ్యింది. అటు ఇటు చక్కర్లు కొడుతూ.. చివరికి పోలీసుల కంట పడింది.


మోటారు వెహికల్ చట్టం ప్రకారం.. కదులుతున్న కారుపై ఇలా స్టంట్స్ చేయడం నేరం. దీంతో.. పోలీసులు ఆ యువతి వీడియోపై చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఆ థార్ ఓనర్‌ని కనుగొన్న పోలీసులు.. ఆ కారుని స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు. అలాగే.. ఇలాంటి దిక్కుమాలిన స్టంట్స్ మరోసారి చేయొద్దని ఆ యువతితో పాటు ఆ కారులో ఉన్న ఇతరులకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇలాంటి ఆలోచనలేమైనా ఉంటే, వెంటనే మానుకోవడం బెటర్.

Updated Date - 2023-08-04T15:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising