ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వర్షంలో తడుస్తూ నడుచుకుంటూ వెళ్తోందో మహిళ.. సడన్‌గా నడిరోడ్డు మీద గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆమెను ఆపి మరీ..

ABN, First Publish Date - 2023-04-15T14:34:41+05:30

సాటి మనుషుల పట్ల కరుణ, జాలి అనేవి ప్రస్తుత రోజుల్లో కనుమరుగైపోతున్నాయి. పూర్తిగా తెలియని మనుషులకు సహాయం చేయడం అనేది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. అయితే చాలా అరుదుగా కొందరు మాత్రం ఇతరుల కష్టాలకు స్పందిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సాటి మనుషుల పట్ల కరుణ, జాలి అనేవి ప్రస్తుత రోజుల్లో కనుమరుగైపోతున్నాయి. పూర్తిగా తెలియని మనుషులకు సహాయం చేయడం అనేది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. అయితే చాలా అరుదుగా కొందరు మాత్రం ఇతరుల కష్టాలకు స్పందించి మానవత్వం (Humanity) ఉన్న మనుషులుగా నిరూపించుకుంటున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) ఆ విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

goodnews_movement అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో ఒక మహిళ తన బిడ్డను ఎత్తుకుని వర్షంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి గొడుగు పట్టుకుని నడుస్తున్నాడు. గొడుగు లేకుండా బిడ్డను ఎత్తుకుని వస్తున్న మహిళను చూశాడు. వెంటనే తన గొడుగును (Umbrella)ఆమెకు ఇచ్చి వెళ్లిపోయాడు. తనకు గొడుగు ఇచ్చిన అపరిచితుడిని ఆ మహిళ మనస్ఫూర్తిగా అభినందించింది. ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

Viral Video: బిడ్డ జోలికి వస్తే ఏ తల్లయినా ఊరుకుంటుందా..? నీళ్లలో ఉన్న మొసలినే భయపెట్టి పారిపోయేలా చేసిన ఏనుగు..!

ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. ``మానవత్వం, దయతో ఈ ప్రపంచాన్ని మార్చాలి. బిడ్డను ఎత్తుకుని వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ అపరిచితుడు తన గొడుగును ఇచ్చేశాడ``ని కామెంట్ చేశారు. ఈ వీడియోను దాదాపు లక్ష మందికి పైగా వీక్షించారు. అతడు నిజమైన మహారాజని ఒక నెటిజన్ ప్రశంసించాడు.

Updated Date - 2023-04-15T14:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising