Women: రెండేళ్ల నుంచి ఓ యువతికి క్యాన్సర్ చికిత్స చేస్తున్న హాస్పిటల్.. అసలు నిజం బయటపడటంతో ఊహించని ట్విస్ట్..
ABN, First Publish Date - 2023-10-20T15:26:18+05:30
రెండేళ్ళ నుండి చికిత్స తీసుకుంటున్నా ఎప్పుడూ ఎవరికీ అనుమానం రాలేదు.. కానీ చివరికి..
క్యాన్సర్ ప్రపంచంలో ప్రజల మరణాలకు కారణం అవుతున్న ప్రాణాంతక జబ్బులలో ఒకటి. ఓ మహిళ క్యాన్సర్ బారిన పడగా ఆమెకు రెండేళ్ళ నుండి చికిత్స జరుగుతోంది. ఒక రోజు ఎప్పటిలా టెస్టులకోసం హాస్పిటల్ కు వెళ్లిన ఆమెకు ఊహించని నిజం తెలిసింది. దీంతో హాస్పిటల్ సిబ్బంది కూడా భయపడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
యుకె(UK)లో ఈస్ట్ యార్క్ షైర్ కు చెందిన 33ఏళ్ళ మేగాన్ రాయల్ అనే మహిళకు 2019లో చర్మక్యాన్స(Skin cancer) ఉన్నట్టు నిర్థారణ అయింది. ఆ తరువాత ఆమె చికిత్సలో భాగంగా ఇమ్యునోథెరపీ చేయించుకుంది. ఇలాగే తను గర్బం ధరించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే కారణంతో ముందుజాగ్రత్తగా తన అండాలను భద్రపరుచుకునేలా చర్యలు తీసుకుంది. ఇలా రెండేళ్లు గడిచిపోయిన తరువాత ఒకరోజు ఆమె హాస్పిటల్ కు ఎప్పటిలా టెస్టులకోసం వెళ్ళగా అక్కడ ఊహించని నిజం బయటపడింది. అసలు ఆమెకు చర్మ క్యాన్సర్ లేనే లేదనే విషయం రిపోర్టులలో చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. వెంటనే అదే విషయాన్ని ఆమెకు తెలియజేశారు.
Viral News: 92ఏళ్ల భర్తను కలవడానికి 80ఏళ్ళ భార్య చేసిన కోర్టు పోరాటం.. అసలింతకీ వీళ్ళ కథేంటంటే..
తనకు ఎలాంటి క్యాన్సర్ లేదనే విషయం తెలియగానే మేగాన్ రాయల్ కూడా ఆశ్చర్యానికి లోనైంది. ఆమె తీవ్రమైన భావోద్వేగంలో స్థబ్దుగా ఉండిపోయింది. విషయాన్ని అర్థం చేసుకోవడానికి, అది నిజమని నమ్మడానికి ఆమెకు సమయం పట్టింది. ఆ తరువాత తాను రెండేళ్ళ నుండి చికిత్స కోసం చేసిన ఖర్చు, అనుభవించిన మానసిక వేదనను ప్రస్తావిస్తూ తనకు పరిహారం కావాలని కోర్టును కోరింది. ఆమె కోర్టు పిటిషన్ ను విచారించిన కోర్టు ఆమెకు పరిహారం అందేలా చేసింది. రాయల్ మార్స్డెన్ అనే NHS ఫౌండేషన్ ప్రతినిధి ఒకరు ఆమెకు ఎదురైన అనుభవాలకు. ఆమె అన్నిరోజులు పడిన మానసిక వేదనకు క్షమాపణలు తెలిపారు. మేగాన్ రాయల్ కూడా తను అన్నిరోజులు చాలా మానసిక క్షోభ అనుభవించానని, రెండేళ్ళపాటు తన జీవితం చాలా దారుణంగా గడిచిందని చెప్పుకొచ్చింది. పరిహారం అందిన తరువాత ఆమె ఇప్పుడు కొత్తజీవితాన్ని ప్రారంభించింది.
Viral Video: రోజూ ఏదో కుడుతున్నట్లు ఉన్నా మొదట అనుమానం రాలేదు.. చివరకు ఓ రోజు ఇంటి సీలింగ్ బద్ధలుకొట్టి చూస్తే..
Updated Date - 2023-10-20T15:26:18+05:30 IST