Women's Day 2023: అప్పులివ్వడానికి ఆడవాళ్లే బెటర్ అట... ఆసక్తిగొలిపే కారణాలివే!
ABN, First Publish Date - 2023-03-08T08:14:40+05:30
Women Borrowers: చాలామంది మహిళలు తమ వ్యక్తిగత ఖర్చులకు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుకు వస్తున్నందున, దేశంలో మహిళలకు రుణాలు అందించేవారు పెరిగారు.
Women Borrowers: చాలామంది మహిళలు తమ వ్యక్తిగత ఖర్చులకు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుకు వస్తున్నందున, దేశంలో మహిళలకు రుణాలు అందించేవారు పెరిగారు. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ డేటా(TransUnion Sybil Data) ప్రకారం, పురుషులతో పోలిస్తే తక్కువ రిస్క్ ప్రొఫైల్(Risk Profile) కలిగిన మహిళల సంఖ్య పెరగడం దీని వెనుకనున్న కారణాలలో ఒకటి.
ట్రాన్స్‌యూనియన్ సిబిల్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, CY 2022లో 57% మంది మహిళా రుణగ్రహీతలు(Women Borrowers) ప్రైమ్ స్కోర్ పరిధిలోకి వచ్చారు. అయితే పురుష రుణగ్రహీతల విషయానికొస్తే అదే సంవత్సరంలో ఇది 51%కి పరిమితం అయ్యింది. 660-719 క్రెడిట్ స్కోర్ ఉన్న రుణదాతల(Creditors) వర్గాల్లో ప్రైమ్ ఒకటి. క్రెడిట్ స్కోర్ 300-900 పరిధిలో పరిగణిస్తారు. దీనికి మహిళల తక్కువ రిస్క్ ప్రొఫైల్, వారి స్వీయ అవగాహన(Self awareness) స్వభావం దీనికి అనుసంధానించారు. ఇది CY 2021లో 13% నుండి CY 2022లో 15%కి చేరుకుంది.
ఇది స్వీయ పర్యవేక్షక మహిళా వినియోగదారుల సంఖ్యను ప్రతిబింబిస్తుంది. మహిళల్లో CIBIL స్కోర్ చక్కగా ఉండటమే దీనికి కారణం. CY 2021లో 5.7 మిలియన్లతో పోలిస్తే 2022లో 8.2 మిలియన్ల మంది మహిళలు తమ CIBIL స్కోర్, రిపోర్టు(Report)ను సమర్పించారు. మహిళా రుణగ్రహీతల స్వీయ పర్యవేక్షణలో 83% పెరుగుదల ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఇది పురుష వినియోగదారుల విషయంలో కేవలం 60% గానే ఉంది. మహిళా రుణగ్రహీతలలో 28% మంది తమ క్రెడిట్ ప్రొఫైల్‌ను 20+ పాయింట్లు మెరుగుపర్చుకున్నారని నివేదిక తెలియజేసింది.
మహిళల CIBIL స్కోర్ మెరుగ్గా ఉండటమనేది వారి మెరుగైన ఆర్థిక అవగాహన(Financial awareness), క్రెడిట్ స్పృహను ప్రతిబింబిస్తుందని నివేదిక పేర్కొంది. క్రెడిట్ క్రమశిక్షణ విషయంలో మహిళలు అవగాహన కలిగి ఉన్నారని, వారి క్రెడిట్ ప్రొఫైల్‌ను నిరంతరం మెరుగుపరచుకునేందుకు చురుకైన చర్యలు తీసుకుంటున్నారని నివేదిక వెల్లడిస్తోంది. ఈ నివేదిక(Report) ప్రకారం 2017- 2022 మధ్య గత ఐదేళ్లలో వ్యాపార రుణాలను కోరుతున్న మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
పెరుగుతున్న రుణాల సంఖ్య భారతదేశంలోని మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌ల వృద్ధికి ప్రతిబింబం అని నిపుణులు అంటున్నారు. బిజినెస్ లోన్(Business Loan) పోర్ట్‌ఫోలియోలో మహిళల వాటా 2017లో 20% నుండి 2022లో 32%కి 12 శాతం పాయింట్లు పెరిగిందని కూడా నివేదిక తెలియజేసింది. అంతేకాకుండా గృహ రుణ విభాగంలో కూడా మహిళల సంఖ్య పెరిగింది. గృహ రుణ విభాగంలో గత ఐదేళ్లలో వారి భాగస్వామ్యం(Sharing) 6% పెరిగింది. అలాగే మహిళలు.. వ్యక్తిగత రుణాలు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్‌లు, గోల్డ్ లోన్(Gold Loan)లు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
Updated Date - 2023-03-08T13:27:02+05:30 IST