2024 రిపబ్లిక్ పరేడ్‌లో నారీశక్తి: సాధికారతను చాటనున్న త్రివిధ దళాల మహిళా సైనికులు.. మొదలైన సన్నాహాలు... పూర్తి వివరాలివే..!
ABN, First Publish Date - 2023-05-08T11:13:03+05:30
భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పరేడ్(parade) అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించే పరేడ్‌లో భద్రతా బలగాలు(Security forces), వివిధ రాష్ట్రాలకు చెందిన శకటలు, ఆయుధ ప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకునే విధంగా జరుగుతాయనే విషయం విదితమే.
భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పరేడ్(parade) అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించే పరేడ్‌లో భద్రతా బలగాలు(Security forces), వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు, ఆయుధ ప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకునే విధంగా జరుగుతాయనే విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను(Republic Day celebrations) ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పరేడ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక సంచలన నిర్ణయం(Sensational decision) తీసుకుంది.
మహిళా సాధికారతను చాటే దిశగా...
రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్(Kartavyapath)లో నిర్వహించే పరేడ్ వేడుకలో పోలీస్, ఆర్మీ, పారామిలటరీ తదితర దళాలు పాల్గొంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈనాటి వరకూ జరుగుతూ వస్తున్న ఈ వేడుకల్లో పురుషులు, మహిళలు పాల్గొనేవారు. అయితే 2024లో అంటే వచ్చే ఏడాది ఈ సంప్రదాయం(Tradition) పూర్తిగా మారిపోనుంది. స్త్రీ పురుష జవాన్లు సంయుక్తంగా పాల్గొనే ఈ కవాతులో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. 2024 రిపబ్లిక్ డే పరేడ్‌లో కేవలం మహిళా సైనికులతోనే కవాతు జరగనుంది. దేశంలోని అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా మహిళలు దూసుకెళ్తుతున్న ప్రస్తుత తరుణంలో నారీ శక్తిని చాటడానికి ప్రభుత్వం(government) ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్మీ వర్గాల కసరత్తు
సైన్యంతో పాటు అన్ని రంగాల్లోని మహిళల ప్రాతినిధ్యాన్ని, సాధికారతను పెంచడానికి ఈసారి వీరనారులతో కవాతు నిర్వహించనున్నామని సైనిక విభాగానికి చెందిన అధికారులు(Officers) చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే త్రివిధ బలగాలు సన్నాహాలు ప్రారంభించాయని తెలిపారు. గడచిన మార్చినెలలోనే.. రాబోయే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనబోతున్న వివిధ రక్షణ సంస్థలు(Defense agencies), ఆర్మీ, పోలీస్, పారామిలటరీలకు ఈ సమాచారం అందించారు. వచ్చే ఏడాది పరేడ్‌కు సారధ్యం వహించేవారి దగ్గరి నుంచి బ్యాండ్ పార్టీ, శకటాల ప్రదర్శనల వరకు అందరూ మహిళలే ఉండనున్నారని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా కేంద్రం నుంచి ఈ విషయంపై తమకు అధికారిక లేఖ అందిందని, దీని అమలుపై కసరత్తు చేస్తున్నట్సు ఆర్మీ వర్గాలు(Army) తెలియజేశాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ సైనిక శక్తికి, సంస్కృతి సంప్రదాయాలకు, విజయాలను ప్రతిబింబిస్తాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా...
ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రముఖులు హాజరై వేడుకలను ప్రత్యక్షంగా తిలకిస్తారు. కోట్లాది మంది టీవీలలో చూస్తారు. వేడకులకు విదేశాలకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని ముఖ్య అతిథిగా(chief guest) ఆహ్వానిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. కాగా ఈసారి మహిళా శక్తిని ప్రపంచానికి తెలియజేసేలా, మహిళలను మరింత ప్రోత్సహించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
మహిళా సారధ్యం ఇలా...
2015లో తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన మహిళల బృందం(group of women) వేర్వేరుగా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంది. 2019లో కెప్టెన్ శిఖా సురభి ఆర్మీ డేర్‌డెవిల్స్ జట్టు నుంచి పరేడ్‌లో పాల్గొని బైక్ స్టంట్ చేసిన మొదటి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020లో కెప్టెన్ తానియా షెర్గిల్(Captain Tania Shergill) త్రివిధ దళాల పురుషుల బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా నిలిచారు. 2021లో ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ పరేడ్‌లో పాల్గొన్న మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా వార్తల్లోకి ఎక్కారు.
చరిత్రలో చిరిస్థాయిగా నిలిచిన వీర నారీమణులు
చరిత్రలోకి వెళితే సేనలకు సారధ్యం వహించిన వారిలో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి(Jhansi Lakshmibai) ప్రముఖంగా కనిపిస్తారు. కాకతీయ చక్రవర్తులలో ఎంతో పేరుప్రతిష్టలు గడించి, జనం మనసులలో స్థిరమైన స్థానాన్ని దక్కించుకున్న చక్రవర్తి గణపతిదేవుని కుమార్తె రుద్రమదేవి. ఆమె తండ్రికి తగిన తనయగా ఎంతో ఆదర్శవంతమైన పాలనను అందించింది. రాణీ రుద్రమదేవి(Rani Rudramadevi) తాను చక్రవర్తిగా మారక మునుపే రాజ్య నిర్వహణలోని మెలుకువలన్నీ నేర్చుకుని, క్రీ.శ. 1262 అధికారికంగా సామ్రాజ్య పట్టమహిషి అయ్యింది. ఓరుగల్లును రాజధానిగా చేసుకొని 27 ఏళ్ల పాటు సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. సైన్యంతో దండెత్తి వచ్చిన మహాదేవునిపై పది రోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ అపరభద్రకాళిలా విజృంభించి, తన ధైర్య సాహసాలు చాటింది.
ఇక భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర(History of Indian Freedom Struggle)లో రాణి లక్ష్మీబాయి (1835-58) పేరు విననివారెవరూ ఉండరు. ఝాన్సీ ప్రాంతానికి చెందిన ధైర్యసాహసోపేతురాలైన మహారాణిగా ఆమె పేరుగాంచింది. పందొమ్మిదో శతాబ్దంలో బ్రిటిషు వారి పాలనను ఎదిరించిన వీరనారి ఝాన్సీ రాణీ లక్ష్మీభాయి. మణికర్ణిక(Manikarnika) అనేది ఆమె చిన్నప్పటి పేరు. మరాఠా సంస్థానమైన ఝాన్సీ పరిపాలకుడు రాజా గంగాధర రావుతో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లయిన తరువాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది. 1857 మే నెలలో మీరట్, ఢిల్లీలలో సిపాయిలు.. బ్రిటీషు అధికారులపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అది ఉత్తర భారతదేశంలోని(North India) ఇతర ప్రాంతాలకు విస్తరించింది. కాలక్రమంలో ఝాన్సీలో కూడా తిరుగుబాటు తలెత్తింది. బ్రిటీష్ జనరల్ హ్యూ రోజ్‌పై పోరాటం సాగించిన రాణి లక్ష్మీబాయి తమ ఝాన్సీ కోటను(Jhansi Fort) సంరక్షించుకుంది.
Updated Date - 2023-05-08T13:45:04+05:30 IST