ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

world fastest train: కళ్లు మూసి తెరిచేలోగా గమ్యస్థానానికి చేర్చే ఆ రైలు... పట్టాల మీద నడవదు.. గంటకు ఎంత వేగంతో పరిగెడుతుందంటే...

ABN, First Publish Date - 2023-03-23T07:57:13+05:30

world fastest train: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు జపాన్ లేదా అమెరికాలో లేదు... మన దేశానికి పొరుగున ఉన్న చైనాలో ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

world fastest train: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు జపాన్ లేదా అమెరికాలో లేదు... మన దేశానికి పొరుగున ఉన్న చైనాలో ఉంది. షాంఘై మాగ్లేవ్(Shanghai Maglev) అనే ఈ రైలు షాంఘైలోని పుడాంగ్ విమానాశ్రయాన్ని లాంగ్‌యాంగ్ రోడ్ స్టేషన్‌కు కలుపుతుంది. షాంఘై మాగ్లెవ్ రైలు గరిష్ట వేగం గంటకు 460 కిలోమీటర్లు. ఈ సూపర్ స్పీడ్ రైలు(Super speed train) సాయంతో 700 కిలోమీటర్ల దూరాన్ని సుమారు ఒకటిన్నర నుండి రెండు గంటల్లో అధిగమించవచ్చు.

ఈ రైలుకున్న ఒక ప్రత్యేక అంశమేమంటే దీనికి సంప్రదాయ ఇనుప చక్రాలు(Iron wheels) లేవు. దీనికి బదులుగా ఇది మాగ్నెటిక్ లెవిటేషన్(Magnetic levitation) (మాగ్లెవ్)తో నడుస్తుంది. ఈ టెక్నిక్‌లో ట్రాక్‌లపై అయస్కాంత ప్రభావం(Magnetic effect) ఉంటుంది. రైలు ఈ ట్రాక్‌లకు కొద్దిగా పైన గాలిలో ఉంటుంది. ట్రాక్‌ల అయస్కాంత ప్రభావం కారణంగా, రైలు స్థిరంగా ఉంటుంది. ఎటువంటి శబ్దం లేకుండా అధిక వేగం(High speed)తో నడుస్తుంది.

మాగ్లెవ్ టెక్నాలజీ(Maglev technology) మొదట జర్మనీలో ఉపయోగించారు. ఈ మాగ్లెవ్ రైలు గత దశాబ్ద కాలంగా చైనాలో నడుస్తోంది. తాజాగా చైనా(China) గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే మాగ్లెవ్ రైలును సిద్ధం చేసింది. ఈ రైలు పొడవు 153 మీటర్లు, వెడల్పు 3.7 మీటర్లు. ఎత్తు 4.2 మీటర్లు. దీనిలో మొత్తం 574 మంది ప్రయాణికులు(Passengers) ప్రయాణించవచ్చు. ఇందులో 3 రకాల కోచ్‌లు ఉన్నాయి. వీటిలో ఫస్ట్ క్లాస్(First class), సెకండ్ క్లాస్, ఎండ్ సెక్షన్ ఉన్నాయి. ఈ రైలులో ప్రయాణించేందుకు చైనా పౌరులతో పాటు, విదేశీయులు(Foreigners) కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు.

Updated Date - 2023-03-23T09:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising