ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్.. ఏ పాలతో తయారవుతుందో తెలిస్తే... ముక్కున వేలేసుకుంటారు!

ABN, First Publish Date - 2023-04-15T10:07:48+05:30

మీరు ఇప్పటి వరకు చాలాసార్లు పన్నీర్(Paneer) తినేవుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పన్నీర్ గురించి మీకు తెలుసా? పులే చీజ్ అని పిలిచే ఈ అత్యంత ఖరీదైన పన్నీరు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మీరు ఇప్పటి వరకు చాలాసార్లు పన్నీర్(Paneer) తినేవుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పన్నీర్ గురించి మీకు తెలుసా? పులే చీజ్ అని పిలిచే ఈ అత్యంత ఖరీదైన పన్నీరు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పన్నీర్ ధర సుమారు 800 నుండి 1000 యూరోలు(1000 euros). అంటే కిలో రూ. 80,000 నుండి 82,000. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్‌గా గుర్తింపు పొందింది. అయితే ఈ పన్నీర్ ఎందుకు ఇంత ఖరీదు అనే దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

ఈ పన్నీరు గాడిద పాలతో తయారవుతుందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. సెర్బియాలో కనిపించే ప్రత్యేక జాతి గాడిద 'బాల్కన్'(Balkan) పాలతో ఈ పన్నీరు తయారవుతుంది. ఈ ప్రత్యేకమైన 'పూలే చీజ్'('Poole Cheese') ప్రతి దేశంలో ఉత్పత్తి చేయరు. ఇది సెర్బియాలోని 'జసవికా స్పెషల్ నేచర్ రిజర్వ్'లో మాత్రమే ఉత్పత్తి అవుతుంది.

దీనిని తయారు చేయడానికి 60 శాతం బాల్కన్ గాడిద పాలు(Balkan donkey milk), 40 శాతం మేక పాలు ఉపయోగిస్తారు. తరువాత దానిని ప్రాసెస్(Process) చేసి పన్నీరు తయారు చేస్తారు. ఈ విధంగా ఒక కిలో పన్నీరు తయారు చేయడానికి దాదాపు 25 లీటర్ల బాల్కన్ గాడిద తాజా పాలు అవసరం అవుతుంది. ఈ చీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారాలలో(foods) ఒకటిగా పేరుగాంచింది.

Updated Date - 2023-04-15T10:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising