ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

World War II Ship: సముద్ర గర్భంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి నౌక గుర్తింపు..

ABN, First Publish Date - 2023-04-23T20:34:26+05:30

దాదాపు 84 ఏళ్లక్రితం రెండో ప్రపంచ యుద్ధం (Second world war) సమయంలో ఏకంగా 864 మంది ఆస్ట్రేలియన్ సైనికులతో సముద్రంలో మునిగిపోయిన జపాన్‌కు చెందిన మర్చంట్ షిప్ దక్షిణ చైనా సముద్రంలో బయటపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాదాపు 84 ఏళ్లక్రితం రెండో ప్రపంచ యుద్ధం (Second world war) సమయంలో ఏకంగా 864 మంది ఆస్ట్రేలియన్ సైనికులతో సముద్రంలో మునిగిపోయిన జపాన్‌కు చెందిన మర్చంట్ షిప్ దక్షిణ చైనా సముద్రంలో బయటపడింది. విశేష అనుభవమున్న సర్వే నిపుణులు ఈ షిప్‌ను సముద్రగర్భంలో గుర్తించినట్టు ఆస్ట్రేలియా రక్షణమంత్రి రిచర్డ్ మార్లెస్ శనివారం వెల్లడించారు. ఈ షిప్‌ పేరు ఎస్ఎస్ మోంటెవిడియో మరూ(SS Montevideo Mar). రహస్య ఖైదీలను రవాణా చేసేందుకు ఈ షిప్‌ను ఉపయోగించేవారని, జులై 1942లో ఫిలిప్పైన్స్ తీరంలో మునిగిపోయిందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా చరిత్రలో ఇది అతిపెద్ద సముద్ర విపత్తుగా ఆయన పేర్కొన్నారు.

ఈ షిప్‌ పపువా న్యూగినియా నుంచి చైనాలోని హనోయ్‌కి ప్రయాణిస్తుండగా యూఎస్ సబ్‌మెరైన్ టార్పెడోతో దాడి చేసిందని వివరించారు. అయితే ఈ నౌకలో యుద్ధ ఖైదీలు ఉన్నారా లేదా అనేది మాత్రం తెలియదన్నారు. ఎస్ఎస్ మోంటెవిడియో మరూ నౌక ఏ ప్రాంతంలో మునిగిపోయిందో తెలియకపోవడంతో ఈ ఘటనలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి ఒక వేదనగా మిలిగిపోయిందని రిచర్డ్ మార్లెస్ వ్యాఖ్యానించారు.

కాగా మెరైన్ ఆర్కియాలజీ స్వలాభం కోసం పనిచేయదని, శిథిలాల కోసం సర్వే నిపుణుల సారధ్యంలో సముద్ర గర్భంలో అన్వేషణలు చేస్తారని ఆస్ట్రేలియా ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ నౌకను 13,123 అడుగుల లోతులో గుర్తించినట్టు, ఆస్ట్రేలియా డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ కూడా సహకారం అందించినట్టు వివరించారు. కాగా ఈ విపత్తులో 1000 మందిపైగా పురుషులు మృత్యువాతపడ్డట్టు అంచనాగా ఉంది. ఇందులో యుద్ధ సైనికులతోపాటు వేర్వేరు దేశాలకు చెందిన పౌరులు ఉన్నారని భావిస్తున్నట్టు మార్లెస్ ప్రస్తావించారు.

Updated Date - 2023-04-23T20:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising