ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడారి గురించి మీకు తెలిసినదంతా అస్సలు నిజం కాదు... ‘సహారా’నే అతి పెద్దదనుకుంటే అది మరో అబద్ధమట... మరి నిఖార్సయిన నిజం ఇదేనట..

ABN, First Publish Date - 2023-05-01T12:52:15+05:30

ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి(Biggest desert) ఏది అంటే చాలామంది ‘సహారా’ అని చెబుతారు. అయితే ఈ ప్రశ్నకు ఇది సరైన సమాధానం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఎడారి అంటే ఏమిటో తెలుసుకోవలసిన అవసరం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి(Biggest desert) ఏది అంటే చాలామంది ‘సహారా’ అని చెబుతారు. అయితే ఈ ప్రశ్నకు ఇది సరైన సమాధానం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఎడారి అంటే ఏమిటో తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇసుకతో కూడిన ప్రదేశాన్ని మాత్రమే ఎడారి(desert) అంటారా? అంటే కాదనే చెప్పాలి. వాస్తవానికి ఎడారి అనేదానికి సరైన శాస్త్రీయ నిర్వచనం మరొకలా ఉంది. నిజానికి, ఎడారి ఏ రూపంలోనైనా ఉండవచ్చని అంటోంది ఆధునిక సైన్స్(Modern science). అంటే ఎడారిలో ఇసుక నుండి మంచు వరకు ఏదైనా ఉండవచ్చని చెబుతోంది.

ఎడారికి సరైన నిర్వచనం ఏమిటంటే ఒక సంవత్సరంలో 25 సెంటీమీటర్ల కంటే తక్కువ అంటే 9.8 అంగుళాల వర్షం కురిసే ప్రాంతం ఎడారి ప్రాంతం కింద లెక్కిస్తారు. శాస్త్రవేత్తలు(Scientists) దీనినే స్పష్టం చేశారు. పలు నివేదికల ప్రకారం ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్ విశ్వవిద్యాలయ వాతావరణ శాస్త్రవేత్త జోనాథన్ విలే(Jonathan Wiley) కూడా ఈ నిర్వచనానికి మద్దతు పలికారు.

ఈ కోణంలో మనం ఎడారుల గురించి నిర్వచిస్తే భూమిపై అతిపెద్ద వేడి ఎడారి ‘సహారా’... అతిపెద్ద చల్లని ఎడారి అంటార్కిటికా. ఈ రెండు ప్రాంతాలలో ఏడాది పొడవునా సగటున 9.8 అంగుళాల కంటే తక్కువ వర్షం(less rain) కురుస్తుంది. ఈ విధంగా ప్రపంచంలోని అతిపెద్ద వేడి ఎడారి ఏది అనే ప్రశ్నకు సహారా సమాధానం అవుతుంది.

అయితే ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది అని అడిగినప్పుడు దానికి సరైన సమాధానం అంటార్కిటికా అవుతుంది. అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో 14 మిలియన్ సంవత్సరాల నుంచి ఒక్క చుక్క వర్షం(rain) కూడా కురవలేదు. జోనాథన్ విలే తెలిపిన వివరాల ప్రకారం అంటార్కిటికాలోని మెక్‌ముర్డో డ్రై వ్యాలీ కొన్ని మిలియన్ల సంవత్సరాలుగా వర్షాలు కురవని ప్రాంతంగా నిలిచింది. ఈ ప్రాంతం అత్యంత చల్లగా ఉంటుంది. సూక్ష్మజీవులు(Microorganisms), నాచు, లైకెన్లు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఇవి ఈ చలిని తట్టుకోగలవు. కాగా లడఖ్‌లో ప్రతి సంవత్సరం సగటున 25 రోజులు మాత్రమే వర్షం పడుతుంది. అదికూడా దాదాపు 9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురుస్తుంది. ఇంత తక్కువ వర్షపాతం కారణంగా లడఖ్(Ladakh) ఎడారి ప్రాంతపు ప్రమాణాలను నెరవేరుస్తుంది. అంటే ఇది ఎడారి వర్గంలోకి వస్తుంది. దీనిని భారతదేశంలోని చల్లని ఎడారి(cold desert) అని కూడా పిలుస్తారు.

Updated Date - 2023-05-01T12:52:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising