అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీం... దానిని తినాలంటే ధనంవంతులు కూడా వెయ్యిసార్లు ఆలోచించాల్సి వస్తుందట!
ABN, First Publish Date - 2023-05-08T08:53:15+05:30
ఎవరికైనా ఖరీదైన వస్తువులంటే అమితమైన ఆసక్తి(Excessive interest) ఉంటుంది. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని తహతహలాడిపోతుంటారు. అటువంటి ఒక ఆహార పదార్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరికైనా ఖరీదైన వస్తువులంటే అమితమైన ఆసక్తి(Excessive interest) ఉంటుంది. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని తహతహలాడిపోతుంటారు. అటువంటి ఒక ఆహార పదార్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే అత్యంత ఖరీదైన ఐస్ క్రీం(Expensive ice cream).. దాని ధర వెయ్యో, రెండు వేలో కాదు... మీ ఊహకు అందనంత ధరలో ఉంది. జపాన్‌కు చెందిన ఐస్‌క్రీమ్ తయారీదారు సిలాటో(Silato)... బైకుయా అనే ప్రోటీన్‌తో కూడిన ఐస్‌క్రీం తయారు చేస్తోంది.
ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీం. ఆడిటీ సెంట్రల్ న్యూస్(Oddity Central News) వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏప్రిల్ 25న ఈ కొత్త ఐస్‌క్రీం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా రికార్డు(record) సృష్టించింది. ఈ ఐస్ క్రీంను ప్రధానంగా పాలతో తయారు చేస్తారు. ఇది వెల్వెట్ మాదిరిగా ఉంటుంది. దీనిలో చీజ్, గుడ్డులోని పచ్చసొన(Egg yolk) కూడా కలుపుతారు. ఇంతేకాకుండా ఈ ఐస్ క్రీం తయారీలో పార్మిజియానో చీజ్, వైట్ ట్రఫుల్ ఆయిల్(White truffle oil) వంటివి కూడా జతచేరుస్తారు. ఈ ఐస్ క్రీంను స్టైలిష్ బ్లాక్ బాక్స్‌లో ప్యాక్ చేస్తారు.
ఇక్కడ విశేషమేమిటంటే చేతితో తయారు చేసిన మెటల్ స్పూన్(Metal spoon)ను ఈ ఐస్ క్రీంతో పాటు అందజేస్తారు. ఈ చెంచాలను క్యోటోకు చెందిన హస్తకళాకారులు తయారు చేస్తారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో 130ml Byakuya ఐస్ క్రీం ధర $6700. మన కరెన్సీలో దీని ధర రూ.5 లక్షలకు పైమాటే. దీంతో ధనవంతులు కూడా ఈ ఐస్ క్రీం తినాలంటే వెయ్యిసార్లు ఆలోచించాల్సి వస్తుందట.
అయితే ఐస్‌క్రీమ్‌తోపాటు వచ్చే స్పూన్(Spoon) ఖరీదనది కావడంతోనే దీని ధర అమాతం పెంచారనుకుంటే పొరపాటే. ఈ ఐస్‌క్రీం ధర అత్యధికం కావడంతోనే ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో(Guinness World Records) చోటు దక్కించుకుంది. వైట్ వైన్‌తో ఈ ఐస్‌క్రీమ్ తింటే ఎంతో బాగుంటుందని తయారీదారులు చెబుతున్నారు.
Updated Date - 2023-05-08T13:40:27+05:30 IST