most expensive shoes: ఈ షూ ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు... ఇంత ధర ఎందుకో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-03-27T09:55:21+05:30
ఫొటోలో కనిపిస్తున్న ఈ ఒక జత షూ ధర 19.9 మిలియన్ డాలర్లు. మనం దీనిని భారత రూపాయిలలోకి మార్చినట్లయితే దాదాపు రూ. 1,63,93,92,088కి సమానం.
ఫొటోలో కనిపిస్తున్న ఈ ఒక జత షూ ధర 19.9 మిలియన్ డాలర్లు. మనం దీనిని భారత రూపాయిలలోకి మార్చినట్లయితే దాదాపు రూ. 1,63,93,92,088కి సమానం. ఈ షూ పేరు మూన్ స్టార్ షూస్(Moon Star Shoes). దీని ఖరీదు 1.63 బిలియన్ల కంటే ఎక్కువ. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ ఇదే. ఈ షూ స్వచ్ఛమైన బంగారం(Pure gold)తో తయారయ్యింది. దీనికి 30 క్యారెట్ల వజ్రాలు(Diamonds) పొదిగారు. దీనిలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ షూ తయారీకి 1576 నాటి ఉల్క కూడా ఉపయోగించారు.
24 క్యారెట్ బంగారంతో చేసిన ఈ షూలలో మొదటి జత 2017 సంవత్సరంలో ఆంటోనియో వయాట్రి (Antonio Viatri) తయారు చేసింది. రెండవ స్థానంలో ప్యాషన్ డైమండ్ షూస్(Passion Diamond Shoes) ఉన్నాయి. వాటి ఖరీదు 17 మిలియన్ డాలర్లు అంటే భారతీయ రూపాయలలో 1,39,99,06,650 రూపాయలు. ఈ షూను జడా దుబాయ్, ప్యాషన్ జువెలర్స్(Passion Jewellers) సంయుక్తంగా తయారు చేశాయి. ఇది రెండు 15 క్యారెట్ డి-గ్రేడ్ వజ్రాలతో పొదిగారు.
దీనితో పాటు ట్రిమ్‌ను అలంకరించడానికి 238 వజ్రాలను విడిగా ఉపయోగించారు. ఈ బూట్ల తయారీకి మొత్తం 9 నెలల సమయం పట్టింది. ఖరీదైన బూట్లలో హీల్స్ మూడో స్థానంలో ఉన్నాయి. దాని పేరు డెబ్బీ వింగ్‌హామ్(Debbie Wingham) హై హీల్స్. ఈ హీల్స్ ధర 15.1 మిలియన్ డాలర్లు. దానిని భారత రూపాయిలకు మారిస్తే, అది రూ.1,24,34,46,495కి సమానం అవుతుంది. దీని తయారీకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రత్నాలను(gems) ఉపయోగించారు. ఈ హీల్స్ ప్లాటినం(Platinum)తో తయారు చేశారు. ప్లాటినం ఒక లోహం, దీనిని వైట్ గోల్డ్(White gold) అని కూడా పిలుస్తారు.
Updated Date - 2023-03-27T10:13:41+05:30 IST