ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Most Expensive Whiskey: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ ఇదే.. ధర లక్షల్లో కాదండోయ్.. కోట్లలో..!

ABN, First Publish Date - 2023-11-21T18:59:44+05:30

ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువు పాతబడే కొద్దీ విలువ కోల్పోతుంటుంది. అయితే ఆల్కహాల్ విషయంలో మాత్రం పాతబడ్డే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంటుంది. విస్కీ లేదా వైన్ ఎంత పాతది అయితే దాని ఖరీదు అంత ఎక్కువగా ఉంటుంది. తాజాగా లండన్‌లో వేలం వేసిన ఓ విస్కీ బాటిల్‌‌కు కళ్లు చెదిరే ధర పలికింది.

ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువు పాతబడే కొద్దీ విలువ కోల్పోతుంటుంది. అయితే ఆల్కహాల్ (Alcohol) విషయంలో మాత్రం పాతబడ్డే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంటుంది. విస్కీ (Whiskey) లేదా వైన్ (Old Wine) ఎంత పాతది అయితే దాని ఖరీదు అంత ఎక్కువగా ఉంటుంది. తాజాగా లండన్‌ (London)లో ఒక విస్కీ బాటిల్‌ను వేలం వేశారు. ఆ వేలంలో దానికి కళ్లు చెదిరే ధర పలికింది. ఒక్క విస్కీ బాటిల్‌ కోసం ఏకంగా రూ.22 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. మకల్లాన్ కంపెనీ (Macallan) ఈ సింగిల్ మాల్ట్ విస్కీని 1926లో తయారుచేసింది (Most Expensive Whiskey).

ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోథెబి (Sotheby) లండన్‌లో శనివారం నిర్వహించిన వేలం పాటలో (Auction) ఈ విస్కీ బాటిల్‌కు కళ్లు చెదిరే ధర పలికింది. మెకల్లాన్ కంపెనీ ఈ విస్కీని 1926లో తయారుచేసింది. 1986లో ఆ విస్కీని 40 బాటిళ్ళలోకి నింపింది. 60 ఏళ్ళపాటు నిల్వ చేసి తాజాగా ఓ బాటిల్‌ను వేలానికి పెడితే ఊహించిన దాని కంటే భారీ ధర పలికింది. ఇలాంటి మద్యం బాటిళ్లు అప్పుడప్పుడు వేలానికి వస్తుంటాయి. వాటికి రికార్డు స్థాయిలో ధర పలకడం కూడా జరుగుతుంటుంది. గతంలో ఇటువంటి బాటిల్‌ను రూ.15 కోట్లకు విక్రయించారు (Viral).

Indian Railway: సూపర్ ఐడియా గురూ.. రైల్లోనే సినిమా థియేటర్.. సడన్‌గా చూసి అవాక్కైన ప్రయాణీకులు..!

ఈ బాటిల్స్ డిజైనింగ్, లేబుల్స్ విషయంలో కూడా మకల్లాన్ సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈ బాటిల్స్‌లో 12 బాటిల్స్‌ను పాప్ కళాకారుడు సర్ పీటర్ బ్లేక్‌, 13 బాటిళ్లను ఇటాలియన్ పెయింటర్ వాలేరియో అడామీ డిజైన్ చేశారు. మిగిలిన బాటిళ్లను ఐకానిక్ ఫైన్, రేర్ లేబుల్స్‌తో అలంకరించారు. కాగా, ఈ బాటిల్‌లోని ఓ చుక్క రుచి చూసేందుకు వేలం పాట నిర్వాహకుడికి అనుమతి ఉండడం విశేషం.

Updated Date - 2023-11-21T18:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising