ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది ప్రపంచంలోనే అత్యంత చిన్న శునకం.. దీనికున్న మరిన్ని ప్రత్యేకతలు ఏమిటో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-04-12T09:20:50+05:30

ప్రపంచంలో అత్యంత కురచ జీవులను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కోవలోకే వస్తుంది ఒక శునకం. అది కేవలం మూడు అంగుళాల పొడవు(Three inches long), అర కిలో బరువు(Weighs half a kilo) మాత్రమే ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రపంచంలో అత్యంత కురచ జీవులను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కోవలోకే వస్తుంది ఒక శునకం. అది కేవలం మూడు అంగుళాల పొడవు(Three inches long), అర కిలో బరువు(Weighs half a kilo) మాత్రమే ఉంటుంది. ఇది జేబులో లేదా ఏదైనా హ్యాండ్‌బ్యాగ్‌(handbag)లో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. చివావా జాతికి చెందిన ఈ కుక్క పేరు పెర్ల్(Pearl). ఇన్ని ప్రత్యేకతలున్న పెర్ల్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌(Guinness Book of World Records)లో కూడా నమోదైంది. 2020వ సంవత్సరంలో జన్మించిన పెర్ల్ ఎత్తు 9.14 cm (3.59 in), పొడవు 12.7 cm (5.0 in) దీని పరిమాణం డాలర్ నోటుకు సమానం అని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే.

పెర్ల్ యజమాని వెనెస్సా సెమల్(Vanessa Semalt) తన పెంపుడు కుక్కను చూసి మురిసిపోతుంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న కుక్క అయిన పెర్ల్‌ తన దగ్గర ఉండటం చాలా అదృష్టం(good luck)గా భావిస్తున్నానని ఆమె చెబుతోంది. పెర్ల్ ఎత్తు, బరువును మూడుసార్లు కొలవడం ద్వారా పెర్ల్ రికార్డు(record) ధృవీకరించారు. పెర్ల్ స్వభావం ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా చివావా జాతి కుక్కలు ఉల్లాసభరితంగా ఉంటాయి. పెర్ల్... మిరాకిల్ మిల్లీ(Miracle Millie)కి బంధువు. ఇది గతంలో ప్రపంచంలోనే అతిచిన్న కుక్క అనే బిరుదును దక్కించుకుంది.

Updated Date - 2023-04-12T09:27:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising