Xiaomi Smart TV: భారత మార్కెట్లోకి షియామీ కొత్త స్మార్ట్ టీవీ.. ఫీచర్స్ అద్దిరిపోయాయిగా
ABN, First Publish Date - 2023-09-15T16:54:50+05:30
అమెజాన్(Amazon) తో కలిసి షియామీ(Xiaomi) భారత్(India) లో కొత్త స్మార్ట్(Smart TV) టీవీని లాంచ్ చేసింది. అదే Fire TV OS - ఆధారిత రెడ్ మీ స్మార్ట్ టీవీ 4K. ఇందులో విభిన్నమైన ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.
అమెజాన్(Amazon) తో కలిసి షియామీ(Xiaomi) భారత్(India) లో కొత్త స్మార్ట్(Smart TV) టీవీని లాంచ్ చేసింది. అదే Fire TV OS - ఆధారిత రెడ్ మీ స్మార్ట్ టీవీ 4K. ఇందులో విభిన్నమైన ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. స్లిమ్ మెటల్ బాడీ కలిగిన ఈ టీవీ 43 అంగుళాల స్క్రీన్ ని కలిగి ఉంది. మంచి క్వాలిటీతో కూడిన ఆడియో, వీడియో దీని ప్రత్యేకం. డాల్బీ ఆడియో, DBS వర్చువల్, DTS HD టెక్నాలజీని కలిగి ఉంది. డిఫరెంట్ హోం ఫీచర్లూ(Home Features) ఉన్నాయి.
సెటప్ బాక్స్, DTH టీవీ ఛానళ్లు, ఓటీటీ యాప్ ల మధ్య మారేటప్పుడు ఎలాంటి అవాంతరాలు లేకుండా దీన్ని డిజైన్ చేశారు. మరో ముఖ్యమైన ఫీచర్.. ఇది యాపిల్ ఎయిర్ ప్లే, మిరాకాస్ట్ లకు సపోర్టివ్ గా ఉంటుంది. అంటే యాపిల్(Apple), ఆండ్రాయిడ్(Android) స్మార్ట్ ఫోన్(Smart Phones) ల నుంచి కాస్టింగ్ ని అనుమతిస్తుంది. అలెక్సా(Alexa) ఫీచర్ తో ఇంగ్లీష్, హిందీ భాషల్లో టీవీతో నేరుగా ఇంటరాక్ట్ కావచ్చు. ఇందులో ఉన్న మరో ఫీచర్ పిక్చర్ ఇన్ పిక్చర్. ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ కలిగి ఉండి, ఆప్టికల్ పోర్ట్ తో కలగలిపి ఉంటుంది.
రిమోట్ స్పెషాలిటీస్ ఇవే..
రెడ్ మీ స్మార్ట్ టీవీ కి ఉన్న రిమోట్(TV Remote) సైతం స్పెషల్ ఫీచర్లు కలిగి ఉంది. టీవీ గైడ్, ప్లే బ్యాక్ కంట్రోల్స్, ఛానల్ అప్/డౌన్, మ్యూట్ పాపులర్ యాప్ లకు షార్ట్ కట్ కోసం రిమోట్లో బటన్లను సైతం ప్రొవైడ్ చేసింది. దీనికి తోడు అలెక్సా బటన్ కూడా ఉంది.
ధరలివే..
కొత్త రెడ్ మీ స్మార్ట్ టీవీ ధరను రూ.24 వేల 999 గా నిర్ణయించారు. ఇది షియామీ స్టోర్లలో, అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. టీవీపై సంవత్సరం వారంటీ(Warranty) కూడా ఇచ్చారు.
Updated Date - 2023-09-15T16:56:56+05:30 IST