ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yami Gautam: ఆ టీనేజర్ రహస్యంగా నా వీడియో తీశాడు.. ఆవేదన వ్యక్తం చేసిన బాలీవుడ్ నటి

ABN, First Publish Date - 2023-02-28T12:05:43+05:30

మనదేశంలో సినీ నటులకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎక్కడ ఉన్నా వారిని చాలా కళ్లు గమనిస్తూనే ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మనదేశంలో సినీ నటులకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎక్కడ ఉన్నా వారిని చాలా కళ్లు గమనిస్తూనే ఉంటాయి. అయితే ఈ క్రేజ్ వారికి సంతోషాన్ని ఇచ్చినప్పటికీ.. దాని వల్ల కొన్ని సార్లు వారు ఇబ్బందులు పడుతుంటారు. ఇటీవలే తను ఇంట్లో ఉండగా ఇద్దరూ వ్యక్తులు ఫోన్ తన వీడియో తీయడం గురించి ఆలియా భట్ (Alia Bhatt) ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే.. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) కూడా ఇలాంటి అనుభవమే ఎదురు కావడం గురించి సోషల్ మీడియా వేదికగా బాధ పడింది. తాజాగా మరో నటికి అలాంటి అనుభవమే ఎదురైందట.

నితిన్ మూవీ ‘కొరియర్‌బోయ్ కల్యాణ్’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన బ్యూటీ యామీ గౌతమ్ (Yami Gautam). ఆ సినిమా ఫెయిల్యూర్‌గా నిలవడంతో అనంతరం ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలపైనే ఎక్కువగా కాన్‌సన్‌ట్రేట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యామీ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఇది కూడా చదవండి: Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

యామీ మట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ఎవరైనా, ఎక్కడైనా ఎవరి అనుమతి తీసుకోకుండా వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఎవరో అబ్బాయి నా ఫామ్‌లో ఉండగా వచ్చాడు. చాలా చిన్న పిల్లవాడు, 19-20 సంవత్సరాల వయస్సు ఉంటుందేమో. నా సిబ్బందిని ఒక ఫోటో తీసుకుంటానని అభ్యర్థించాడు. నేను కూడా అనుమతించాను. అప్పుడు అతను ఫొటో తీస్తున్నాడని అనుకున్నాను. కానీ వీడియో తీస్తున్నాడు. అది చాలా దారుణంగా అనిపించింది. ఆ వీడియోని తన వ్లాగ్‌లో షేర్ చేశాడు. దానికి మిలియన్ల కొద్ది వ్యూస్ కూడా వచ్చాయి. దాని వల్ల నాకు పాపులారిటీ వచ్చి ఉండొచ్చు. అయితే అనంతరం మరి కొంతమంది వచ్చి నా ఇంటిని హోమ్ టూర్ చేయడానికి ప్రయత్నించారు. అది చూసి నాకేం అర్థం కాలేదు. అసలు మనం ఎక్కడికి పోతున్నాం. ఇది సరికాదు. ప్రతి దానికి ఓ హద్దు ఉంటుంది కదా’ అని ఆవేదనగా చెప్పుకొచ్చింది.

Updated Date - 2023-02-28T12:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!