Naga Chaitanya - Samantha: విడాకుల తర్వాత ఆసక్తికర పోస్ట్‌!

ABN, First Publish Date - 2023-02-26T19:07:38+05:30

విడాకులు అనంతరం తొలిసారి సమంత (samantha) గురించి ఆసక్తికర పోస్ట్‌ చేశారు నాగచైతన్య (Naga chaitanya). వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రం ‘ఏమాయ చేశావే’ (Ye Maaya Chesave) విడుదలై 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Naga Chaitanya - Samantha: విడాకుల తర్వాత ఆసక్తికర పోస్ట్‌!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విడాకులు అనంతరం తొలిసారి సమంత (samantha) గురించి ఆసక్తికర పోస్ట్‌ చేశారు నాగచైతన్య (Naga chaitanya). వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రం ‘ఏమాయ చేశావే’ (Ye Maaya Chesave) విడుదలై 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. గౌతమ్‌మీనన్‌ (gautham menen) దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే సమంత హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చారు. అందులో జెస్సీగా (jessy)నటించి యువత మనసు దోచుకుంది. కార్తిక్‌ పాత్రలో చై కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారు. వీరిద్దరు ఈ చిత్రంలో తొలి విజయం అందుకున్నారు. ‘ఏమాయ చేశావే’ సెట్‌లోనే చై-సామ్‌ల మధ్య స్నేహం మొదలైంది. అది ప్రేమగా మారి ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తెరపైనే కాదు ఆఫ్‌ స్ర్కీన్‌లోనూ ఈ జోడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే వ్యక్తిగత కారణాలతో అక్టోబర్‌ 2, 2021య విడిపోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఈ జంట ఎందుకు విడిపోయింది అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. విడాకుల అనంతరం ఏ ఒక్కరూ కూడా కామెంట్స్‌ చేసుకోవడం గానీ చేయలేదు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. అయితే సమంత చైతూకు సంబంధించిన ఫొటోల జ్ఞాపకాల్పి మొత్తం సోషల్‌ మీడియా నుంచి తొలగించారు. ఏడాదిన్నర తర్వాత నాగచైతన్య సమంతకు సంబంధించి పోస్ట్‌ చేశారు. ఇంతకీ అది వ్యక్తిగత విషయం గురించి కాదు. వారిద్దరూ కలిసి నటించి హిట్‌ అందుకున్న ‘ఏమాయ చేశావె’ చిత్రం 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ మూవీలో సమంతతో కలిసున్న పోస్టర్‌ను షేర్‌ చేశారు. సెలబ్రేటింగ్‌ 13 ఇయర్స్‌ అంటూ పోస్ట్‌ చేశాడు. సమంత కూడా ‘ఏమాయ చేశావె’కు పదమూడేళ్లు అంటూ తన నటించిన ఫొటో పాత్రలన్నీంటిని ఫొటోగా చేసి పోస్ట్‌ చేశారు. అయితే నాగచైతన్య ఉన్న ఏ ఫొటో పెట్టకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. (naga chaitanya viral post)

Sam.jpg

Updated Date - 2023-02-26T19:14:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising