Yellow Teeth: పళ్లన్నీ ఇలా పచ్చగా మారిపోతున్నాయా..? ఏ మందులూ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్‌తో దంతాలను తెల్లగా మారడం ఖాయం..!
ABN, First Publish Date - 2023-04-11T20:39:45+05:30
చక్కగా బ్రెష్ చేస్తూ.. మరెన్నో జాగ్రత్తలు పాటించినా పళ్ళ విషయంలో ఫలితాలు ఉండటం లేదని బాధపడేవారు కోకొల్లలు ఉన్నారు. ఈ టిప్స్ గురించి తెలిస్తే.. బాప్ రే ఇన్నిరోజులు మాకెందుకు తెలీలేదు ఇవి అనుకుంటారేమో..
కోల్గేట్ యాడ్ చూసే ఉంటారు. పళ్ళు ఇకిలించి నవ్వడంలో కూడా ఆత్మవిశ్వాసం ఉంటుంది. నవ్వు వరకు వద్దు కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలామంది ఇబ్బందికి లోనవుతుంటారు. కారణమేమిటంటే.. పళ్ళన్నీ పసుపు రంగులోకి మారి ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇలా పళ్ళు పసుపురంగులో ఉండటం చూసి కొందరు మాట్లాడుతుండగానే ఏదో ఒకసాకు చెప్పి పక్కకెళ్ళిపోతుంటారు. మరికొందరికి నోటి నుండి దుర్వాసన(bad smell) కూడా వస్తూ ఉంటుంది. చక్కగా బ్రెష్ చేస్తూ.. మరెన్నో జాగ్రత్తలు పాటించినా పళ్ళ విషయంలో ఫలితాలు ఉండటం లేదని బాధపడేవారు కోకొల్లలు ఉన్నారు. అలాంటి వారు బెంగపడక్కర్లేదు. సింపుల్ చిట్కాలు పాటించి మిలమిల మెరిసే దంతాలను సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ పళ్ళు దుర్వాస వస్తూ పసుపురంగు(yellow teeth)లో ఎందుకు ఉంటాయి? వీటిని తెల్లగా మార్చుకోవడానికి ఏం చెయ్యాలి? తెలుసుకుంటే..
పళ్ళు తోమే విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం, వేళ కాని వేళలో ఆహారం తీసుకోవడం, ఎక్కువకాలం పాటు మందులు వాడటం, కెఫిన్ ఆధారిత పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాల వల్ల పళ్ళు పసుపురంగులోకి మారతాయి. పళ్ళ గురించి సరైన జాగ్రత్త తీసుకోకపోతే పళ్ళు దుర్వాసన వస్తాయి. పళ్ళు తిరిగి తెల్లగా మారడానికి, దుర్వాసన పోవడానికి చిట్కాలు..
వంట సోడా..(cooking soda)
పళ్ళమీద పసుపురంగు గార తొలగించుకోవడానికి వంటసోడా చాలా బాగా పనిచేస్తుందనే విషయం చాలామందికి తెలుసు. కానీ ఎలా వాడాలి అనే విషయంలో అవగాహన ఉండదు. వంట సోడాను ప్రతి రోజూ పళ్ళు తోమడానికి ఉపయోగించకూడదు. వారంలో రెండు నుండి మూడ సార్లు(twice or thrice in week) మాత్రమే వంట సోడాతో పళ్ళు తోమాలి. వంటసోడాతో పళ్ళు తోమడం వల్ల పళ్ళ మీద మురికి, పసుపు రంగు పోతుంది. పళ్ళ మీద గార కూడా మెల్లిగా తగ్గుముఖం పడుతుంది.
స్ట్రాబెర్రీ..(strawberry)
స్ట్రాబెర్రీని మిల్క్ షేక్ లు, ఐస్ క్రీములు, కేక్ లు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటే పొరపాటే. పళ్ళను శుభ్రం చేయడంలో స్ట్రాబెర్రీ అద్భుతంగా పనిచేస్తుంది(Strawberry cleans teeth). రెండు స్ట్రాబెర్రీలను(two strawberry) తీసుకుని మెత్తటి గుజ్జుగా తయారు చేసి ఈ పేస్ట్ ను బ్రష్ మీద వేసుకుని సహజంగానే పళ్ళు తోముకోవాలి. పళ్ళ మీద మురికి, పసుపురంగు గార, పాచి తొలగిపోతాయి. ఈ స్ట్రాబెర్రీ పేస్ట్ లో కాసింత వంట సోడా కూడా మిక్స్ చేసి బ్రష్ చెయచ్చు. దీనివల్ల మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి.
Viral Photo: ఈ ఫొటోలోని పాప ఎవరో గుర్తు పట్టగలరా..? తండ్రి సినీ ఇండస్ట్రీని ఏళ్ల తరబడి ఏలుతున్న అగ్రహీరో..!
ఆయిల్ పుల్లింగ్..(oil pulling)
ఆయిల్ పుల్లింగ్ అనేది ఆయుర్వేదంలో ఎప్పటినుండో ఉన్న అద్బుతమైన పద్దతి. కొబ్బరి నూనెతో నోటిని పుక్కిలించడం ద్వారా పళ్ళు అద్బుతంగా మారతాయి. ఒక స్పూన్ మోతాదులో కొబ్బరినూనెను(1table spoon coconut oil) నోట్లో వేసుకుని సుమారు 15నిమిషాలు పుక్కిలించాలి. ఇలా చేసిన తరువాత సాధారణంగా బ్రష్ చేయవచ్చు. ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా పళ్ళ మీద పసుపు, నోటి దర్వాసన పోవడమే కాకుండా పళ్ళు గట్టిపడతాయి. చిగుర్లు దృఢంగా మారతాయి. దంత సమస్యలు దూరంగా ఉంటాయి.
నిమ్మకాయ..(Lemon)
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పళ్ళమీద మంచి ప్రభావం చూపిస్తుంది. నిమ్మతొక్కలను(Lemon peels) తీసుకుని పళ్ళమీద రుద్దవచ్చు. లేదంటే కాసింత నిమ్మరసం వేలితో తీసుకుని పళ్ళు తోముకోవాలి. ఈ రెండింటిలో ఏది చేసినా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
White hair: కొబ్బరి నూనెలో ఈ రెండిటినీ కలపి రాసుకోండి చాలు.. తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!
Updated Date - 2023-04-11T20:39:45+05:30 IST