ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rs 2000 Notes: అక్టోబర్ 7వ తారీఖే లాస్ట్ డేట్ కానీ.. ఆ తర్వాత కూడా 2 వేల నోట్లను మార్చుకునేందుకు మరో దారి..!

ABN, First Publish Date - 2023-10-07T15:53:00+05:30

పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోట్లకు కూడా కాలం చెల్లింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఈ ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెల 30వ తేదీలోపు రూ.2000 నోట్లను మార్చుకోవాలని కేంద్రం డెడ్‌లైన్ విధించింది.

పెద్ద నోట్ల రద్దు (Demonetisation) తర్వాత కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోట్లకు కూడా కాలం చెల్లింది. రూ.2 వేల నోట్ల (Rs 2000 Notes)ను ఉపసంహరించుకుంటున్నట్టు ఈ ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెల 30వ తేదీలోపు రూ.2000 నోట్లను మార్చుకోవాలని (Rs 2000 Notes exchange) కేంద్రం డెడ్‌లైన్ విధించింది. బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని, లేదంటే బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచించింది. ఆ తర్వాత ఆ డెడ్‌లైన్‌ను ఈ రోజు (అక్టోబర్ 7) వరకు పొడిగించింది.

ఆర్బీఐ ప్రకటన ప్రకారం రూ.2 వేల నోట్లను మార్చుకునే గడువు ఈ రోజు (October 7)తో ముగిసింది. ఇప్పటి వరకు 87 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇంకా రూ.12 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని చెప్పారు. ఈ రోజు తర్వాత కూడా రూ.2 వేల నోట్లను కలిగి ఉన్న వారు ఏం చేయాలి. అలాంటి వారి కోసం ఆర్బీఐ ఓ సూచన చేసింది. డెడ్‌లైన్ దాటిన తర్వాత కూడా రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చు.

Viral Photo: ఈ ఫొటోలోనే దాగి ఉందో సీక్రెట్.. జాగ్రత్తగా చూసినా గుర్తించడం యమా కష్టం.. ఏముందో చెప్పగలరా..?

ఆర్బీఐ సూచించిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కరూ రూ.20 వేల వరకు మాత్రమే అంటే.. కేవలం 10 రెండు వేల నోట్లను మాత్రమే డిపాజిట్ చేసే వీలుంటుంది. ఆ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. కాగా, రూ.2 వేల నోట్లను మొదట 2016లో ఆర్బీఐ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, 2019 నుంచి కేంద్రం రూ.2 వేల నోట్లను ప్రింట్ చేయడం ఆపేసింది.

Updated Date - 2023-10-07T15:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising