ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోలెడు రోగాలు బాధిస్తున్నాయా? రాత్రి పడుకునే ముందు బొడ్డు దగ్గర ఇలా చేసి చూడండి.. ఫలితం చూసి మీరే షాకవుతారు..

ABN, First Publish Date - 2023-03-19T14:39:57+05:30

వైద్యులు చెప్పిన మందులు వాడినప్పుడు ఫలితం బానే ఉంటుంది. కానీ రెండు రోజులు తిరగకనే మళ్ళీ కొత్త సమస్య మొదలవుతుంది.కరోనా తరువాత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇప్పటికాలంలో ఏదో ఒక జబ్బుతో బాధపడుతూనే(Suffering with health problems) ఉంటున్నారు ప్రజలు. వీటి పరిష్కారాల కోసం డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. వైద్యులు చెప్పిన మందులు వాడినప్పుడు ఫలితం బానే ఉంటుంది. కానీ రెండు రోజులు తిరగకనే మళ్ళీ కొత్త సమస్య మొదలవుతుంది.కరోనా తరువాత ఇలాంటి సమస్యలు ఎక్కువయ్యాయి చాలామందికి. శరీరంలో మార్పులు చాలా వేగంగా జరిగిపోవడం వల్ల, నాడీవ్యవస్థ(Nerve system) బలహీనమవడం వల్ల ఇలా జరుగుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా రోజూ రాత్రి పడుకునే ముందు నాభి దగ్గర కొన్నిచుక్కల నూనె వేయమని చెబుతున్నారు. ఈ మాట చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. కానీ దీని వల్ల కలిగే ఫలితాలు కూడా చాలా షాకింగ్ గా ఉంటాయి. నాభి లేదా బొడ్డు దగ్గర నూనె ఎందుకు వేయాలి? ఏ నూనెలు వేయాలి? దీనివల్ల కలిగే ఫలితాలు వివరంగా తెలుసుకుంటే..

ప్రాచీనకాలంలో శరీరంలో వివిధ భాగాల్లో నూనెలు వేయడం ద్వారా నాడీవ్యవస్థను బలంగా ఉంచేవారు. అదంతా చాదస్తమని అలాంటివి క్రమంగా వదిలిపెట్టేశారు మనవాళ్ళు. అయితే మన శరీరంలో నాభి(Navel) ప్రాంతంలోనే మన శరీర చక్రం మొదలవుతుంది. తల్లీబిడ్డలను అనుసంధానం చేసి ఉంచేది నాభి స్థానమనే విషయం అందరికీ తెలిసిందే.. ఆ స్థానాన్ని సమతుల్యంగా ఉంచడం ద్వారా నాడీవ్యవస్థను బలోపేతం చేయవచ్చు. అందుకే నాభి ప్రాంతంలో నూనె వేస్తారు.

ఏ నూనెలు ఉపయోగించాలంటే..

నాభిలో వేయడానికి నాలుగు రకాల నూనెలు వాడవచ్చు.

కొబ్బరినూనె లేదా బాదం నూనె..(Coconut or Almond)

కొబ్బరి లేదా బాదం నూనెను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 3చుక్కల(Three Drops) మోదాతులో నాభిలో వెయ్యాలి. దీనివల్ల ముఖం మీద మచ్చలు, మంగు, చర్మం వాడిపోవడం ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి. చర్మం యవ్వనంగా, మెరుస్తూ కనిపిస్తుంది(Skin become Young and Shine).

ఆలివ్ నూనె..(Olive oil)

3చుక్కల ఆలివ్ ఆయిల్ ను నాభిలో వేయడం ద్వారా కడుపుకు సంబంధించి బోలెడు సమస్యలు(Stomach Problems) పరిష్కరించుకోవచ్చు. అంతేకాదు బరువు తగ్గడానికి ఇది మంచి పరిష్కారం(Weight loss Solution). దీర్ఘకాలంగా బాధించే వెన్నునొప్పిని(Back Pain) తగ్గిస్తుంది.

ఆవనూనె..(Mustard Oil)

ఆవనూనెను 2నుండి 3చుక్కల మోదాదులో ఉపయోగించాలి. ఈ నూనె నాభిలో వేయడం వల్ల తలనొప్పి(Headache) తగ్గుతుంది. కంటి చూపు మెరుగవుతుంది(Improve Eye sight), జుట్టు పెరగడానికి(Hair Growth) సహాయపడుతుంది. పెదవులు పగిలిపోయి చిట్లుతుంటే(Lip damage solutions) వాటిని తగ్గిస్తుంది. ఆవనూనెలో అల్లం రసం(Ginger juice With Mustard oil) కలిపి నాభిలో వేస్తే ఎంతో వేధించే కడుపునొప్పి(Stomach upset), వాంతులు(Vomiting), కడుపులో వికారం, కడుపు ఉబ్బరం(Stomach bloating) వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

ఈ మూడు నూనెలలో ఏదో ఒకటి రాత్రి పడుకునే ముందు నాభిలో వేసుకుంటే పైన చెప్పిన ఫలితాలే కాకుండా.. కీళ్ళనొప్పులు(Joint pains) తగ్గుతాయి. నాడీకణాలు రిలాక్స్ అయ్యి శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. ఈ కారణంగా మంచి నిద్ర పడుతుంది. మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేవలం నూనె వేయడమే కాకుండా నాభి చూట్టూ సున్నితంగా మసాజ్ కూడా చేయవచ్చు.

Read also: White Hair: రంగు వెంటనే పోతోందా..? తొందరగా తెల్ల జుట్టు బయటపడుతోందా..? ఈ మూడు చిట్కాలను పాటించండి చాలు..!


Updated Date - 2023-03-19T14:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising