ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fridge Leaking Water: ఫ్రిడ్జ్‌లోంచి నీళ్లు బయటకు వస్తున్నాయా..? ఈ సింపుల్ స్టెప్స్‌తో లీకేజీ సమస్యకు చెక్ పెట్టండి..!

ABN, First Publish Date - 2023-03-27T19:16:38+05:30

ఫ్రిడ్జ్ నుంచి నీరు లీక్ అవడమనేది చాలా సాధారణ సమస్య. అయినప్పటికీ ఆ సమస్య వల్ల కలిగే చిరాకు అంతా ఇంతా కాదు. ఫ్రిడ్జ్ లీకేజీ వల్ల ఇల్లంతా తడితడిగా అయిపోవడం, ఫ్లోరింగ్ పాడైవడం వంటి సమస్యలు వస్తుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఫ్రిడ్జ్ (Fridge) నుంచి నీరు లీక్ అవడమనేది చాలా సాధారణ సమస్య. అయినప్పటికీ ఆ సమస్య వల్ల కలిగే చిరాకు అంతా ఇంతా కాదు. ఫ్రిడ్జ్ లీకేజీ వల్ల ఇల్లంతా తడితడిగా అయిపోవడం, ఫ్లోరింగ్ పాడైవడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఫ్రిడ్జ్ లీకేజీ సమస్యను పరిష్కరించడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మెకానిక్ సహాయం లేకుండా మీ అంతట మీరే మీ ఫ్రిడ్జ్ లీకేజీని అరికట్టవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం పదండి.. (How to Fix a Leaky Fridge)

ముందుగా మీ ఫ్రిడ్జ్‌ను అన్‌ప్లగ్ చేసి అందులోని వస్తువులన్నింటినీ బయటకు తీసెయ్యండి. ఫ్రిడ్జ్ పూర్తిగా ఖాళీ అయ్యాక వాటర్ లీకేజీకి కారణం ఏంటో తెలుసుకోండి. డీఫ్రిజ్‌కు కనెక్ట్ అయి ఉండే పైప్‌ను ముందుగా తనిఖీ చేయాలి. ఆ పైప్ ఎక్కడైనా పగిలిపోయినట్టైతే వెంటనే దానిని బాగు చేసుకోవాలి. అలాగే మీ ఫ్రిడ్జ్ అన్ని వైపులా సమాంతరంగా ఉందా? లేదా? చెక్ చేసుకోండి. ఏవైపు అయినా ఒంగినట్టు ఉంటే అది కూడా లీకేజీకి కారణం కావచ్చు. అలాగే ఫ్రిడ్జ్ కింది భాగంలో ఉండే డ్రెయిన్ పైప్‌ను కూడా ఒకసారి చూడండి. దానికి లీక్‌లు ఉన్నా కూడా నీరు బయటకు వస్తుంటుంది. (Refrigerator Leaking Water)

Viral Video: కారులో వెళ్తూ ఓ వ్యక్తి తీసిన వీడియో ఇది.. ఒకే స్కూటీపై నలుగురు యువతులు యమా స్పీడ్‌గా వెళ్తూనే..

మీ ఫ్రీజర్ డోర్‌ సరిగ్గా పడకపోవడం వల్ల కూడా వాటర్ లీక్ అవుతుంది. డోర్ సరిగ్గా పడకపోవడం వల్ల బయటి ఉష్ణోగ్రతకు ఫ్రిడ్జ్‌లోని చల్లని వస్తువులు, ఐస్ కరిగిపోయి లీకేజీ మొదలవుతుంది. కాబట్టి మీ ఫ్రిడ్జ్ డోర్ రబ్బరు పట్టీలను, సీల్స్‌ను మార్చుకోవాలేమో చూసుకోండి. ఇవన్నీ తనిఖీ చేసినా మీ ఫ్రిడ్జ్ లీకేజీ సమస్య అలాగే ఉన్నట్టైతే అది కంప్రెషర్ సమస్య అయి ఉండవచ్చు. కంప్రెషర్ పాడైపోవడం వల్ల మీ ఫ్రిడ్జ్ వంద శాతం సమర్థతతో పని చేయదు. అప్పుడు కూడా లీకేజీ ఉంటుంది. కంప్రెషర్ పాడైపోతే మాత్రం మెకానిక్‌ను పిలవాల్సందే. (Kitchen Hacks)

Viral Video: ఇంటి ముందు సీబీఐ అధికారులు.. తలుపులు వేసుకుని మరీ ఓ భార్య చేసిన నిర్వాకమిదీ.. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోతో..

Updated Date - 2023-03-27T19:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising