Zomato Delivery Scam: రూ.1000 ఆహారం రూ.200కే.. జొమాటోలో భారీ స్కామ్.. బయటపెట్టిన కస్టమర్..
ABN, First Publish Date - 2023-01-23T19:01:45+05:30
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ `జొమాటో` (Zomato)లో చాలా రోజులుగా జరుగుతున్న భారీ స్కామ్ తాజాగా బయటపడింది. డెలివరీ ఏజెంట్లు సంస్థకు చేస్తున్న నష్టం గురించి ఓ కస్టమర్ తెలియజేశాడు. ఆ వినియోగదారుడి ట్వీట్‌పై ఏకంగా జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ స్పందించారు.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో
(Zomato)లో చాలా రోజులుగా జరుగుతున్న భారీ స్కామ్ తాజాగా బయటపడింది. డెలివరీ ఏజెంట్లు సంస్థకు చేస్తున్న నష్టం గురించి ఓ కస్టమర్ తెలియజేశాడు. ఆ వినియోగదారుడి ట్వీట్‌పై ఏకంగా జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ స్పందించారు. తనకు ఆ స్కామ్ గురించి తెలుసని, లోపాలను సరిదిద్దే పనిలో ఉన్నామని ఆయన సమాధానం ఇచ్చారు (Zomato Delivery Scam).
భర్త వద్దంటున్నా ప్రియుడితో రొమాన్స్.. భార్య ప్రియుడిని సహాయం కోసం పిలిచిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే..!
ఉత్తరాఖండ్‌కు చెందిన వినయ్ సేథి అనే ఎంట్రప్రెన్యూర్ జొమాటో ద్వారా బర్గర్‌లకు ఆర్డర్ ఇచ్చారు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్ ఇంటికి వచ్చింది. ఫుడ్ డెలివరీ జొమాటో డెలివరీ బాయ్ (Zomato Delivery Boy) ఓ సీక్రెట్ చెప్పాడు. ఇకపై ఫుడ్ ఆర్డర్ చేసినపుడు ఆన్‌లైన్ పేమెంట్ చేయవద్దని, క్యాష్ ఆన్ డెలివరీ (Cash On Delivery) ఆప్షన్ ఎంచుకోవాలని చెప్పాడు. ఇలా చేయడం వల్ల రూ.1000 విలువైన ఫుడ్ కేవలం రూ.300కే వస్తుందని చెప్పాడు. జోమాటో నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ బాగోలేదని కస్టమర్ కనుక రిజక్ట్ చేస్తే, ఆ డబ్బులను రెస్టారెంట్‌కు జొమాటో కట్టవలసి ఉంటుంది. ఫుడ్ వెనక్కి ఇవ్వనసరం లేదు. ఈ లూప్ హోల్‌ను ఉపయోగించుకుని డెలివరీ బాయ్‌లు స్కాం చేస్తున్నారు.
వినయ్‌కు ఫుడ్ డెలివరీ చేసిన బాయ్ ఏం చెప్పడంటే.. మీకు డెలివరీ చేసిన ఫుడ్ నచ్చలేదని నేను రిపోర్ట్‌లో రాస్తాను. రెస్టారెంట్‌కు ఆ మనీని జొమాటో కట్టేస్తుంది. నాకు రూ.300 ఇస్తే చాలు. మీరు రూ.1000 ఫుడ్‌ను ఆస్వాదించవచ్చ
ని సలహా ఇచ్చాడు. దీంతో.. దిమ్మతిరిగిపోయిన వినయ్ వెంటనే సోషల్ మీడియా ద్వారా జొమాటో ఫౌండర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపీందర్ గోయల్ స్పందించారు. కొందరు డెలివరీ బాయ్స్ చేస్తున్న మోసం గురించి తనకు తెలుసని, నివారణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Updated Date - 2023-01-23T19:01:47+05:30 IST