PT Usha : 7 పతకాలకు చాన్స్!
ABN, First Publish Date - 2023-03-26T01:36:05+05:30
పారిస్ (2024) ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏడు పతకాలు లభించే అవకాశముందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, మాజీ ఒలింపియన్ పీటీ ఉష ..
2024 ఒలింపిక్స్‌పై ఉష అంచనా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): పారిస్ (2024) ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏడు పతకాలు లభించే అవకాశముందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, మాజీ ఒలింపియన్ పీటీ ఉష అభిప్రాయపడింది. పిల్లలపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించనున్న ‘కిడ్స్ మారథాన్’ జెర్సీని ఆమె శనివారం హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో ఆవిష్కరించింది. అనంతరం ఉష మాట్లాడుతూ ఐఓఏ అధ్యక్ష పీఠం అనేక సవాళ్లతో కూడుకున్నదని తెలిపింది. ‘జాతీయ క్రీడా సంఘాల గుర్తింపు, కేంద్ర క్రీడా పథకాల అమలు, ప్లేయర్ల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టాం. వచ్చే నాలుగైదు నెలల్లో ఐఓఏలోని సమస్యలన్నీ పరిష్కరిస్తాం’ అని చెప్పింది.
Updated Date - 2023-03-26T01:36:05+05:30 IST