ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aman: అమన్‌ అదరహో..

ABN, First Publish Date - 2023-04-14T02:09:53+05:30

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ టీనేజర్‌ అమన్‌ సెహ్రావత్‌ జోరు కొనసాగిస్తూ స్వర్ణం పతకం కొల్లగొట్టాడు. గురువారం జరిగిన పురుషుల 57కి. ఫ్రీస్టయిల్‌ విభాగం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆసియా రెజ్లింగ్‌లో స్వర్ణం

ఆస్తానా (కజకిస్థాన్‌): ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ టీనేజర్‌ అమన్‌ సెహ్రావత్‌ జోరు కొనసాగిస్తూ స్వర్ణం పతకం కొల్లగొట్టాడు. గురువారం జరిగిన పురుషుల 57కి. ఫ్రీస్టయిల్‌ విభాగం ఫైనల్లో 19 ఏళ్ల అమన్‌ 9-4తో సీనియర్‌ రెజ్లర్‌ స్మన్‌బెకోవ్‌ (కిర్గిస్థాన్‌)ను చిత్తు చేసి టైటిల్‌ దక్కించుకున్నాడు. ఇక ఆసియా చాంపియన్‌షి్‌ప పురుషుల 57 కి. కేటగిరీలో భారత్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. వరుసగా నాలుగో ఏడాదీ పసిడి పతకం కైవసం చేసుకుంది. రవికుమార్‌ దహియా గత మూడుసార్లు ఈ విభాగంలో స్వర్ణంతో హ్యాట్రిక్‌ కొట్టాడు. అయితే మోకాలి గాయంతో రవి ఈసారి టోర్నీకి దూరమయ్యాడు. ఇక..గత అక్టోబరులో అండర్‌-23 వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో అమన్‌ పసిడి పతకం అందుకున్నాడు. ఇక..దీపక్‌ కుక్నా (79కి.) కాంస్యం గెలుపొందగా.. 97 కి.కాంస్య పోరులో దీపక్‌ నెహ్రా ఓడాడు.

Updated Date - 2023-04-14T02:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising