ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ambati Rayudu IPL retirement: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటన..

ABN, First Publish Date - 2023-05-28T18:51:43+05:30

తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్ కెరియర్‌కు రిటైర్మెంట్‌ (retirement) ప్రకటించాడు. ఐపీఎల్2023 ఫైనల్‌‌లో (IPL2023 Final) గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ తనకు చివరిదని రాయుడు నిర్ధారించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్ కెరియర్‌కు రిటైర్మెంట్‌ (retirement) ప్రకటించాడు. ఐపీఎల్2023 ఫైనల్‌‌లో (IPL2023 Final) గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ తనకు చివరిదని నిర్ధారిస్తూ రాయుడు ట్వీట్ చేశాడు. కాగా అంబటి రాయుడి ఐపీఎల్ కెరియర్ 2010లో ముంబై ఇండియన్స్ తరపున మొదలైంది. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చెన్నై టైటిల్ గెలిచిన రెండు సీజన్లలో జట్టు సభ్యుడిగా కీలక పాత్ర పోషించాడు.

ట్వీటర్‌లో రాయుడు భావోద్వేగ పోస్ట్...

‘‘ రెండు గొప్ప టీమ్‌లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. 204 మ్యాచ్‌లు. 14 సీజన్లు, 11 ప్లే ఆఫ్స్, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు. ఈ రోజు రాత్రి 6వ టైటిల్ కూడా దక్కుతుందనుకుంటున్నాను. చక్కటి ప్రయాణం. ఈ రోజు రాత్రి జరిగే ఫైనల్ మ్యాచే ఐపీఎల్ కెరియర్‌లో చివరి మ్యాచ్‌గా నిర్ణయించుకున్నాను. ఇంత గొప్ప టోర్నమెంట్‌లో ఆడడం నిజంగా ఆస్వాదించాను. అందరికీ ధన్యవాదాలు. ఈ నిర్ణయంలో యు టర్న్ ఉండదు’’ అని అంబటి రాయుడు తన అఫీషియల్ ట్విటర్‌ అకౌంట్‌లో రాసుకొచ్చాడు. కాగా అంబటి రాయుడు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-28T19:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising