Arshdeep Singh: రెండుసార్లు స్టంప్‌లు విరగ్గొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. బీసీసీఐకి ఎంత నష్టమో తెలుసా?
ABN, First Publish Date - 2023-04-23T13:32:31+05:30
ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ నిప్పులు చెరిగాడు. చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు కావాల్సిన దశలో బౌలింగ్‌కు వచ్చి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ముంబై ఇండియన్స్‌తో (MI) శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ (PBKS) బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) నిప్పులు చెరిగాడు. చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు కావాల్సిన దశలో బౌలింగ్‌కు వచ్చి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ రెండు సందర్భాల్లోనూ అర్ష్‌దీప్ ధాటికి వికెట్లు విరిగిపోయాయి (Arshdeep Singh Breaks 2 LED Stumps). ఈ మ్యాచ్‌లో ముంబైపై పంజాబ్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది.
చివరి ఓవర్లో తిలక్ వర్మ, వధేరాలను అర్ష్‌దీప్ బౌల్డ్ చేశాడు. అర్ష్‌దీప్ యార్కర్ల వేగానికి రెండు సార్లూ మిడిల్ వికెట్లు విరిగిపోయాయి. అందువల్ల బీసీసీఐకి దాదాపు రూ.80 లక్షల వరకు నష్టం వాటిల్లిందట. ఈ ఐపీఎల్‌లో జింగ్ బెయిల్స్ (Zing bails) స్టంప్స్‌ను వాడుతున్న సంగతి తెలిసిందే. ఈ స్టంప్స్‌లో ఎల్‌ఈడీ బల్బులు, కెమెరా, జింగ్ బెయిల్స్ ఉంటాయి. ఒక్కో వికెట్ సెట్ ఖరీదు దాదాపు 48 వేల డాలర్లు (దాదాపు రూ.40 లక్షలు) ఉంటుందట. మూడు వికెట్లలో ఒకటి పాడైనా సెట్ మొత్తం మార్చాల్సి ఉంటుందట.
KL Rahul: రాహుల్ ఉంటే ప్రత్యర్థి జట్టుకే లాభం.. చెత్త బ్యాటింగ్ అంటూ నెటిజన్ల దారుణ ట్రోలింగ్!
అర్ష్‌దీప్ చివరి ఓవర్లో రెండు సార్లు వికెట్లు విరగొట్టాడు. దీంతో రెండు వికెట్ సెట్లు పనికి రాకుండా పోయాయి. అందువల్ల బీసీసీఐకి దాదాపు రూ.80 లక్షల నష్టం వాటిల్లిందట. కెమేరాలను ఇన్‌స్టాల్ చేసిన వికెట్లను తొలిసారి 2008లో ఉపయోగించారు. ఆ తర్వాత రకరకాల కంపెనీలు మరింత అధునాతంగా వికెట్లను రూపొందించడం ప్రారంభించాయి.
Updated Date - 2023-04-23T13:43:52+05:30 IST