ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jack Crawley : అదరగొట్టిన క్రాలే

ABN, First Publish Date - 2023-07-21T03:50:57+05:30

బజ్‌బాల్‌ ఆటతో ఎడాపెడా బాదేసిన ఇంగ్లండ్‌.. నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 67 పరుగుల ఆధిక్యం సాధించింది. వన్డే తరహాలో దూకుడుగా ఆడిన ఓపెనర్‌ జాక్‌ క్రాలే (182 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో

మొయిన్‌, రూట్‌ అర్ధ శతకాలు

ఇంగ్లండ్‌ 384/4

ఆసీస్‌ 317 ఆలౌట్‌

మాంచెస్టర్‌: బజ్‌బాల్‌ ఆటతో ఎడాపెడా బాదేసిన ఇంగ్లండ్‌.. నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 67 పరుగుల ఆధిక్యం సాధించింది. వన్డే తరహాలో దూకుడుగా ఆడిన ఓపెనర్‌ జాక్‌ క్రాలే (182 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 189) త్రుటిలో డబుల్‌ సెంచరీ చేజార్చుకొన్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ రెండో రోజు గురువారం ఆటముగిసే సమయానికి 4 వికెట్లకు 384 పరుగులు చేసింది. బ్రూక్‌ (14), బెన్‌ స్టోక్స్‌ (24) క్రీజులో ఉన్నారు. మొయిన్‌ అలీ (54)తో కలసి రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన క్రాలే.. రూట్‌ (84)తో కలసి మూడో వికెట్‌కు 206 రన్స్‌ జోడించాడు. మరో ఓపెనర్‌ డకెట్‌ (1), అలీని స్టార్క్‌ అవుట్‌ చేశాడు. ద్విశతకం దిశగా దూసుకెళ్తున్న క్రాలేను గ్రీన్‌ బౌల్డ్‌ చేయగా.. రూట్‌ను హాజెల్‌వుడ్‌ పెవిలియన్‌ చేర్చాడు. శనివారం వర్ష ఛాయలు ఎక్కువగా ఉండడంతో వీలైనంత వేగంగా మ్యాచ్‌ను ముగించి సిరీ్‌సను సమం చేయాలనేది స్టోక్స్‌ సేన వ్యూహంగా కనిపిస్తోంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 299/8 వద్ద కమిన్స్‌ (1)ను అండర్సన్‌ క్యాచవుట్‌ చేయగా.. హాజెల్‌వుడ్‌ (4)ను వెనక్కిపంపిన వోక్స్‌ (5/62) ఆసీస్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. మిచెల్‌ స్టార్క్‌ (36 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు.

Updated Date - 2023-07-21T03:50:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising