ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Badminton Asia Championships: దశాబ్దాల తర్వాత భారత్ సంచలనం.. సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీకి గోల్డ్!

ABN, First Publish Date - 2023-04-30T20:52:43+05:30

దుబాయ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఏషియా చాంపియన్‌షిప్స్‌(Badminton Asia

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దుబాయ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఏషియా చాంపియన్‌షిప్స్‌(Badminton Asia Championships)లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి (Satwiksairaj Rankireddy)-చిరాగ్ శెట్టి (Chirag Shetty ) జోడి సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్ నసర్ క్లబ్‌లో షేక్ రషీద్ బిన్ హమ్దాన్ ఇండోర్ హాల్‌లో జరిగిన ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 8 ర్యాంకర్లయిన మలేసియాకు చెందిన యెన్ సిన్-టెయో ఈ యి జంటపై ప్రపంచ నంబర్ 6 జోడీ అయిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి చారిత్రక విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం పతకం. అంతకుముందు 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. మళ్లీ ఇన్ని దశాబ్దాల తర్వాత భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. చారిత్రక విజయం సాధించిన ఈ జోడీపై భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ప్రశంసల జల్లు కురిపించింది. ఈ జోడీకి రూ. 20 లక్షల ప్రైజ్‌మనీని ప్రకటించారు.

Updated Date - 2023-04-30T20:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising