Ajinkya Rahane in WTC Final: రహానే ఎంపిక వెనుక ధోనీ హస్తం.. సెలక్షన్‌కు ముందు ధోనీకి ఫోన్ చేస్తే..

ABN, First Publish Date - 2023-04-28T10:02:53+05:30

కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న అజింక్యా రహానే (Ajinkya Rahane) ఈ ఐపీఎల్‌తో (IPL 2023) తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఏడాదిలో జరిగిన మినీ వేలంలో రహానేను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ నామమాత్రపు ధర (రూ.50 లక్షలు)కు దక్కించుకుంది.

Ajinkya Rahane in WTC Final: రహానే ఎంపిక వెనుక ధోనీ హస్తం.. సెలక్షన్‌కు ముందు ధోనీకి ఫోన్ చేస్తే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న అజింక్యా రహానే (Ajinkya Rahane) ఈ ఐపీఎల్‌తో (IPL 2023) తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఏడాదిలో జరిగిన మినీ వేలంలో రహానేను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ నామమాత్రపు ధర (రూ.50 లక్షలు)కు దక్కించుకుంది. అయితే రహానే అద్భుతంగా ఆడుతూ చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నమ్మశక్యం కాని రీతిలో వేగంగా ఆడుతూ ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నాడు. దీంతో భారత సెలక్టర్ల నుంచి రహానేకు పిలుపు వచ్చింది. WTC ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడే టీమిండియాలో రహానేకు స్థానం దక్కింది (Ajinkya Rahane in WTC Final).

రహానేకు WTC ఫైనల్‌ మ్యాచ్‌లో స్థానం దక్కడం వెనుక చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)సూచనలు ఉన్నాయట. ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ (BCCI) తెలిపింది. WTC ఫైనల్‌ మ్యాచ్‌ సెలక్షన్‌కు ముందు రహానే ఎంపిక గురించి ధోనీ నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ పత్రికతో మాట్లాడుతూ చెప్పారు. WTC ఫైనల్‌ టీమ్‌లో రహానేని చేర్చే ముందు భారత జట్టు మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ మహేంద్ర సింగ్ ధోనీని సంప్రదించారట.

Jaipur: పింక్ సిటీ పసుపుగా ఎందుకు మారిందో తెలుసు.. ధోనీపై రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇంగ్లండ్‌లోని (England) ఓవల్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో (Australia) భారత జట్టు WTC ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అజింక్య రహానేకు ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడిన అనుభవం ఉంది. పేలవ ఫామ్ కారణంగా గతేడాది జనవరి తర్వాత రహానే జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే తాజా ఐపీఎల్ ద్వారా మళ్లీ పుంజుకోవడంతో జాతీయ జట్టులోకి ప్రవేశించాడు.

Updated Date - 2023-04-28T10:02:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising