IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం, ప్లే ఆఫ్ రేస్ నుంచి రాజస్థాన్ ఔట్
ABN, First Publish Date - 2023-05-21T19:55:38+05:30
ఐపీఎల్-16లో 8వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. 18ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 201 పరుగులు చేసింది.
ముంబై: ఐపీఎల్-16 (IPL 2023)లో 8వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై(Sunrisers Hyderabad) ముంబై ఇండియన్స్( Mumbai Indians) ఘనవిజయం సాధించింది. 18ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 201 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ హైదరాబాద్ 200పరుగులు చేసింది. ముంబై ఇండియన్ విజయంతో కామెరాన్ గ్రీన్,ఆకాష్ మధ్వల్ కీలక పాత్ర పోషించారు.
ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించడంతో ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచారు. మరోవైపు పోటీలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కూడా నిష్క్రమించింది. 47 బంతుల్లో అజేయమైన సెంచరీతో ముంబై 201 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. రోహిత్‌శర్మ కూడా మంచి ఫామ్‌ని ప్రదర్శించి 56(37) స్కోర్ చేయడంతో పాటు మధ్యలో నితీష్‌రెడ్డి స్టన్నింగ్ ప్రతిభతో మ్యాచ్ ముగించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆకాష్ మధ్వల్ తన బౌలింగ్‌తో ఒత్తిడి పెంచాడు. నాలుగు వికెట్లు తీసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 200/5 కట్టడి చేయడంలో కీలక భూమిక పోషించాడు. మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త ఓపెనింగ్ జోడీతో ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించారు. వివ్రాంట్ 69(47) స్కోరు వద్ద మాధ్వల్ ఇద్దరు బ్యాటర్‌లను ఔట్ చేయగా, మయాంక్ 46 బంతుల్లో 83 పరుగులు చేశాడు.
Updated Date - 2023-05-21T19:55:38+05:30 IST