ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL CSK vs MI : అజింక్యా.. అదరగొట్టగా

ABN, First Publish Date - 2023-04-09T01:17:24+05:30

తొలుత జడేజా (3/20), శాంట్నర్‌ (2/28) స్పిన్‌తో ముంబైని ఉక్కిరి, బిక్కిరి చేయగా..ఛేదనలో అజింక్యా రహానె (27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

19 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

తిప్పేసిన జడేజా, శాంట్నర్‌

ముంబైపై చెన్నై విజయం

ముంబై: తొలుత జడేజా (3/20), శాంట్నర్‌ (2/28) స్పిన్‌తో ముంబైని ఉక్కిరి, బిక్కిరి చేయగా..ఛేదనలో అజింక్యా రహానె (27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టాడు. దాంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. మొదట ముంబై 20 ఓవర్లలో 157/8 స్కోరు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (21 బంతుల్లో 5 ఫోర్లతో 32), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో ఫోర్‌, 2 సిక్స్‌లతో 31), తిలక్‌ వర్మ (18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22) రాణించారు. తుషార్‌ దేశ్‌పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనను చెన్నై 18.1 ఓవర్లతో 159/3 స్కోరుతో పూర్తి చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (36 బంతుల్లో 40 నాటౌట్‌) ఫామ్‌ కొనసాగించగా, శివమ్‌ దూబే (28) సత్తా చాటాడు. వరుసగా రెండో విజయంతో చెన్నై మురవగా..మరోవైపు రెండో మ్యాచ్‌లో..అది కూడా సొంత మైదానంలోనూ ముంబై ఇండియన్స్‌ బోణీ కొట్టలేకపోయింది. జడేజా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

వావ్‌..అజింక్యా: టెస్ట్‌ జట్టులో చోటు కోల్పోయి ఐపీఎల్‌లో చాన్స్‌కోసం ఎదురు చూస్తున్న 34 ఏళ్ల రహానె తానే నమ్మలేని ఇన్నింగ్స్‌ ఆడాడు. హార్డ్‌హిట్టర్‌ మాదిరి అలవోకగా ఫోర్లు, సిక్స్‌లు కొట్టి ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పోయించాడు. వికెట్‌ రెండు వైపులా క్లాస్‌ షాట్లతో తన క్రికెట్‌ కెరీర్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. కాన్వే (0) డకౌట్‌ అయినా..చెన్నై తరఫున అరగేంట్రంలో అజింక్యా రహానె ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెహ్రెన్‌డార్ఫ్‌ ఓవర్లో సిక్స్‌తో బ్యాట్‌ ఝళిపించిన అజింక్యా..అర్షద్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో 6,4,4,4,4తో దుమ్ము రేపడంతో ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు చెన్నై కొల్లగొట్టింది. ఆపై గ్రీన్‌ బౌలింగ్‌లో 6, చావ్లా బౌలింగ్‌లో 4,4తోపాటు మరో సింగిల్‌తో ఈసారి ఐపీఎల్‌లో ఇప్పటివరకు వేగవంతమైన హాఫ్‌ సెంచరీ (19 బంతుల్లో) రికార్డును రహానె నెలకొల్పాడు. అయితే తమ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న రహానెను పెవిలియన్‌ చేర్చడం ద్వారా ముంబైకు చావ్లా గొప్ప ఊరటనిచ్చాడు. దాంతో రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం శివమ్‌ దూబే కూడా నిష్క్రమించినా రుతురాజ్‌, ‘ఇంపాక్ట్‌’ అంబటి రాయుడు (20 నాటౌట్‌) మ్యాచ్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చారు.

స్పిన్‌కు విలవిల..: టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ప్రత్యర్థి స్పిన్‌కు విలవిలలాడింది. లెఫ్టామ్‌ స్పిన్నర్లు జడేజా, శాంట్నర్‌ వరుస వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టారు. తొలి ఓవర్లో రోహిత్‌ కొట్టిన రెండు బౌండ్రీలతో ప్రారంభమైన ముంబై జోరు..మగాల బౌలింగ్‌లో కిషన్‌ మూడు ఫోర్లు దంచడంతో ఊపందుకుంది. ఇక తుషార్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో సిక్సర్‌ బాదిన రోహిత్‌ (21) మరోసారి అదే షాట్‌ ఆడబోయి క్లీన్‌బౌల్డయ్యాడు. మరోవైపు కిషన్‌ ధాటికి పవర్‌ ప్లేను ముంబై 61/1తో ముగించింది. కానీ జడేజా, శాంట్నర్‌లు తిప్పేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కానీ డేవిడ్‌, తిలక్‌ వర్మతోపాటు చివర్లో షొకీన్‌ (18 నాటౌట్‌) వేగంగా ఆడడంతో ముంబై స్కోరు 150 దాటింది.

స్కోరుబోర్డు

ముంబై: రోహిత్‌ (బి) తుషార్‌ 21, ఇషాన్‌ (సి) ప్రిటోరియస్‌ (బి) జడేజా 32, గ్రీన్‌ (సి అండ్‌ బి) జడేజా 12, సూర్యకుమార్‌ (సి) ధోనీ (బి) శాంట్నర్‌ 1, తిలక్‌ వర్మ (ఎల్బీ) జడేజా 22, అర్షద్‌ ఖాన్‌ (ఎల్బీ) శాంట్నర్‌ 2, టిమ్‌ డేవిడ్‌ (సి) రహానె (బి) తుషార్‌ 31, స్టబ్స్‌ (సి) రుతురాజ్‌ (బి) మగాల 5, హృతిక్‌ (నాటౌట్‌) 18, పియూష్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 157/8. వికెట్ల పతనం: 1-38, 2-64, 3-67, 4-73, 5-76, 6-102, 7-113, 8-131. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 1-0-10-0, తుషార్‌ దేశ్‌పాండే 3-0-31-2, మగాల 4-0-37-1, శాంట్నర్‌ 4-0-28-2, జడేజా 4-0-20-3, ప్రిటోరియస్‌ 4-0-28-0.

చెన్నై: కాన్వే (బి) బెహ్రెన్‌డార్ఫ్‌ 0, రుతురాజ్‌ (నాటౌట్‌) 40, రహానె (సి) సూర్య (బి) పియూష్‌ 61, శివమ్‌ దూబే (బి) కార్తికేయ 28, రాయుడు (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం 18.1 ఓవర్లలో 159/3. వికెట్ల పతనం: 1-0, 2-82, 3-125. బౌలింగ్‌: బెహ్రెన్‌డార్ఫ్‌ 3-0-24-1, అర్షద్‌ ఖాన్‌ 2.1-0-35-0, గ్రీన్‌ 3-0-20-0, పియూష్‌ చావ్లా 4-0-33-1, కుమార్‌ కార్తికేయ 4-0-24-1, హృతిక్‌ షోకీన్‌ 2-0-19-0.

Updated Date - 2023-04-09T01:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising