ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాడు స్టాండ్స్‌లో ఎగిరి.. నేడు విజేతగా నిలిచి!

ABN, First Publish Date - 2023-09-11T00:54:22+05:30

పదకొండేళ్ల కిందట..అప్పటికి ఆ బాలిక వయస్సు ఎనిమిదేళ్లు..అప్పుడే టెన్ని్‌సలో బుడిబుడి అడుగులు వేస్తున్న ఆమె యూఎస్‌ ఓపెన్‌ పోటీలను తిలకించేందుకు క్రమం తప్పకుండా వస్తుండేది..

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): పదకొండేళ్ల కిందట..అప్పటికి ఆ బాలిక వయస్సు ఎనిమిదేళ్లు..అప్పుడే టెన్ని్‌సలో బుడిబుడి అడుగులు వేస్తున్న ఆమె యూఎస్‌ ఓపెన్‌ పోటీలను తిలకించేందుకు క్రమం తప్పకుండా వస్తుండేది..తన ఆరాధ్య క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌, ఆమె సోదరి వీనస్‌ల మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్‌ చేసేది..సీన్‌ కట్‌ చేస్తే..ఇప్పుడు ఆ బాలికే ఫ్లషింగ్‌ మెడో్‌సలో చాంపియన్‌గా నిలిచింది..ఆమే 19 ఏళ్ల కొకొ గాఫ్‌..నాటి జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగా కాబోలు.. మ్యాచ్‌ పాయింట్‌ సాధించగానే కోర్టులో మోకాళ్లపై కూర్చొని తీవ్ర భావోద్వేగానికి లోనైంది..

క్రీడాకారుల కుటుంబం: గాఫ్‌ది క్రీడాకారుల కుటుంబం. తండ్రి కోరీ గాఫ్‌ యూనివర్సిటీస్థాయి బాస్కెట్‌బాల్‌ ఆటగాడు. తల్లి క్యాండీ గాఫ్‌ కూడా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌. దాంతో గాఫ్‌కు సహజంగానే ఆటలపట్ల మక్కువ కలిగింది. అప్పటికే విలియమ్స్‌ సిస్టర్స్‌ అభిమాని అయిన గాఫ్‌ టెన్ని్‌సను కెరీర్‌గా ఎంచుకుంది. ఈక్రమంలో కూతురు ట్రెయినింగ్‌ కోసం గాఫ్‌ తల్లిదండ్రులు తమ కెరీర్‌లను వదులుకున్నారు. మెరుగైన శిక్షణ కోసం టెన్నిస్‌ కోచ్‌ ప్యాట్రిక్‌ మొరాటోగ్లూ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫ్రాన్స్‌లోని అతడి అకాడమీలో 2014లో గాఫ్‌ చేరింది. ప్యాట్రిక్‌ సుదీర్ఘకాలం సెరెనా విలియమ్స్‌కు కోచ్‌గా వ్యవహరించడం విశేషం. 10 ఏళ్ల వయస్సులో అండర్‌-12 అమెరికా నేషనల్‌ టెన్నిస్‌ క్లే కోర్ట్‌ చాంపియన్‌షి్‌ప దక్కించుకున్న పిన్నవయస్సు ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. జూనియర్‌ స్థాయిలో వరల్డ్‌ నెం.1 ర్యాంక్‌ కైవసం చేసుకుని అబ్బురపరిచిన ఆమె, 2018లో 14 ఏళ్ల ప్రాయంలో ప్రొఫెషనల్‌ టెన్ని్‌సలో అడుగుపెట్టింది. 15 ఏళ్లకే వింబుల్డన్‌లో ఆడింది. నాలుగో రౌండ్‌కు చేరడం ద్వారా ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో అతి పిన్నవయస్సులో ఈ రౌండ్‌కు చేరిన క్వాలిఫయర్‌గా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రెండుసార్లు ప్రీక్వార్టర్స్‌ వరకు వెళ్లిన గాఫ్‌..గత ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నర్‌పగా నిలిచింది.

Updated Date - 2023-09-11T00:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising