ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BAN vs AUS: మిచెల్ మార్ష్ ఊచకోత.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం

ABN, First Publish Date - 2023-11-11T19:16:07+05:30

Bangladesh vs Australia: ఈ వరల్డ్ కప్-2023 ప్రారంభంలో ఆస్ట్రేలియా వరుసగా రెండు పరాజయాలు చవిచూడటం చూసి.. ఈసారి కంగారులు లీగ్ దశలోనూ ఇంటి బాట పడతారని అంతా అనుకున్నారు. కానీ.. మూడో మ్యాచ్ నుంచి వరుస విజయాలు నమోదు చేస్తూ వస్తున్నారు.

ఈ వరల్డ్ కప్-2023 ప్రారంభంలో ఆస్ట్రేలియా వరుసగా రెండు పరాజయాలు చవిచూడటం చూసి.. ఈసారి కంగారులు లీగ్ దశలోనూ ఇంటి బాట పడతారని అంతా అనుకున్నారు. కానీ.. మూడో మ్యాచ్ నుంచి వరుస విజయాలు నమోదు చేస్తూ వస్తున్నారు. తమ సత్తా ఏమాత్రం తగ్గలేదని, పడిలేచిన కెరటంలా తాము విజృంభిస్తూనే ఉంటామని మ్యాచ్ మ్యాచ్‌కి నిరూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు లీగ్ దశలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ ఆసీస్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఆ జట్టు నిర్దేశించిన 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించి, తన ఖాతాలో మరో ఘనవిజయాన్ని వేసుకుంది. మిచెల్ మార్ష్ 177 పరుగులతో ఊచకోత కోయడం వల్లే.. ఆసీస్ జట్టు ఈ గెలుపుని సొంతం చేసుకుంది.


తొలుత ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. తౌహీద్ హృదోయ్ (74) అర్థశతకంతో రాణించడంతో, ఇతర బ్యాటర్లు కూడా డీసెంట్ ఇన్నింగ్స్ ఆడటంతో.. బంగ్లా జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 307 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 44.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసి గెలుపొందింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఆస్ట్రేలియా జట్టుకి పెద్ద ఝలక్ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. అప్పుడు మార్ష్, వార్నర్ (53) కలిసి.. ఆచితూచి ఆడారు. మరో వికెట్ పడనివ్వకుండా జాగ్రత్తగా ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదేశారు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కి 112 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వీళ్ల ఆటతీరు చూసి.. వీళ్లే లక్ష్యాన్ని ఛేధిస్తారని అనుకున్నారు.

కానీ.. ఇంతలోనే వార్నర్ ఔట్ అయ్యాడు. అతని తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో (63) కలిసి.. మార్ష్ తన జట్టుని గెలుపు దిశగా తీసుకెళ్లాడు. ఒక దశ వరకు కాస్త నెమ్మదిగా ఆడిన మార్ష్.. ఆ తర్వాత ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వీరబాదుడు షాట్లతో మైదానంలో బౌండరీల వర్షం కురిపించేశాడు. వీళ్లిద్దరే చివరిదాకా క్రీజులో నిల్చొని.. తమ జట్టుని గెలిపించుకున్నారు. మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 సిక్సులు, 16 ఫోర్లు ఉన్నాయి. గత మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో తన జట్టుని గెలిపించుకోవడం, ఈసారి మిచెల్ మార్ష్ ఊచకోత కోయడం చూస్తుంటే.. ఆస్ట్రేలియాని అడ్డుకోవడం దాదాపు అసాధ్యంలా కనిపిస్తోంది.

Updated Date - 2023-11-11T19:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising